Viral: ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టిన బ్యాట్లను షేర్ చేసిన సెహ్వాగ్

ABN , First Publish Date - 2023-06-29T13:35:01+05:30 IST

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో ఆడిన అత్యుత్తన్నత ఇన్నింగ్స్‌లకు సంబంధించిన బ్యాట్‌లను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖతాలో పోస్ట్ చేశాడు. ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, సెంచరీలు కొట్టడానికి ఉపయోగించిన బ్యాట్‌లను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.

Viral: ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టిన బ్యాట్లను షేర్ చేసిన సెహ్వాగ్

టీమిండియా (Team India) మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన కెరీర్లో ఆడిన అత్యున్నత ఇన్నింగ్స్‌లకు సంబంధించిన బ్యాట్‌లను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram ) ఖాతాలో పోస్ట్ చేశాడు. ట్రిపుల్ సెంచరీలు(Triple Centuries), డబుల్ సెంచరీలు(Double Centuries), సెంచరీలు కొట్టడానికి ఉపయోగించిన బ్యాట్‌లను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు. పాకిస్థాన్‌పై(Pakisthan) ట్రిపుల్ సెంచరీ, సౌతాఫ్రికాపై (South Africa)ట్రిపుల్ సెంచరీ, పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టిన బ్యాట్‌లతోపాటు వన్డే క్రికెట్లో వెస్టిండీస్‌పై(West indies) డబుల్ సెంచరీ కొట్టిన బ్యాట్‌లను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా శ్రీలంకపై (Srilanka) ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న బ్యాట్‌ను సెహ్వాగ్ తిప్పి ఉంచాడు. దానికి "బ్యాట్ మే హై దమ్ - 309, 319, 219, 119, 254. ప్యారే సాథీ. లాస్ 293 వాలా #క్రికెట్" అని రాశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ ఇప్పటివరకు రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. కాగా సెహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీని (309) 2004లో పాకిస్థాన్‌పై కొట్టాడు. 2008లో సౌతాఫ్రికాపై మరో ట్రిపుల్ సెంచరీ (319) కొట్టాడు. 2009లో శ్రీలంకపై 293 పరుగులు చేసి తృటిలో ట్రిపుల్ సెంచరీని చేజార్జుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కనుక సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడిగా నిలిచిపోయేవాడు. ఈ క్రమంలోనే ఆ బ్యాట్‌ను తిప్పి ఉంచిన సెహ్వాగ్.. లాస్ 293 వాలా అని రాసుకొచ్చాడు.

Updated Date - 2023-06-29T13:37:17+05:30 IST