టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్?.. వీరూ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2023-06-23T17:42:19+05:30 IST

టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్‌ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా శివ సుందర్ దాస్‌ను బీసీసీఐ నియమించింది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్?.. వీరూ ఏమన్నాడంటే..

టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్‌ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా శివ సుందర్ దాస్‌ను బీసీసీఐ నియమించింది. శివసుందర్ దాస్ సెలక్షన్ టీంలో సౌత్ జోన్ నుంచి ఎస్ శరత్, సెంట్రల్ జోన్ నుంచి సుబ్రొతో బెనర్జీ, వెస్ట్ జోన్ నుంచి సలీల్ అంకోలా సెలెక్టర్లుగా ఉన్నారు.

7B7B96C5-4140-4619-87F3-C855B7B782CA.webp

అయితే త్వరలోనే కొత్త చీఫ్ సెలెక్టర్‌తో కూడిన పూర్తి స్థాయి సెలక్షన్ కమిటీని బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఇందులో భాగంగా నార్త్ జోన్ సెలెక్టర్ పదవి కోసం గురువారం నుంచి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. నార్త్ జోన్‌కు ఎంపికైన వ్యక్తే చీఫ్ సెలెక్టర్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా జాతీయ చీఫ్ సెలెక్టర్‌కు ఉండాల్సిన అర్హతల్లో ఎలాంటి మార్పులు లేవు. గతంలో ఉన్న నిబంధనలే ఈ సారి కూడా ఉన్నాయి. సదరు అభ్యర్థి కనీసం 7 టెస్ట్‌లు లేదా 10 వన్డే మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. వీటితోపాటు అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి కనీసం 5 సంవ్సరాలు అయి ఉండాలి.

904520-58832-hcmpbczpeg-1495530616.jpg

ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్ (Gautam Gambhir), యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పేర్లు కూడా టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో వినిపించాయి. కానీ వారు రిటైర్మెంట్ ప్రకటించి ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే గంభీర్, యువరాజ్‌కు అర్హత లేదు. దీంతో సెహ్వాగ్ పేరు బలంగా వినిపించింది. ఈ విషయమై బీసీసీఐ వీరును సంప్రదించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. పైగా సెహ్వాగ్ నార్త్ జోన్‌కు చెందిన వ్యక్తే కావడం దీనికి మరింత బలం చేకూర్చింది.

834561-yuvraj-singh.jpg

అయితే తాజాగా ఈ వార్తలపై వీరూ మౌనం వీడాడు. ఈ విషయమై ఓ జాతీయ ఛానెల్ అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ‘‘లేదు’’ అని సమాధానం ఇచ్చాడు. బీసీసీఐ తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశాడు. కాగా టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉండే వ్యక్తికి కోటి రూపాయల జీతం అందుతుంది. కానీ ప్రస్తుతం సెహ్వాగ్ ఏడాదికి ఇంతకు మించే సంపాదిస్తున్నాడు. కామెంట్రీ, ప్రకటనలు వంటి వివిధ మార్గాల్లో సెహ్వాగ్‌కు ఏడాదికి రూ.3 -4 కోట్లు అందుతాయని సమాచారం. ఈ ప్రకారం చూసుకుంటే చీఫ్ సెలెక్టర్ పదవిని సెహ్వాగ్ స్వీకరించే అవకాశాలు ఉండకపోవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా టీమిండియా నూతన చీఫ్ సెలెక్టర్ ఎవరనే సస్పెన్షన్‌కు త్వరలోనే తెరపడే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-06-23T17:42:19+05:30 IST