SRH vs KKR Live: మళ్లీ నిరాశపర్చిన బ్రూక్.. పోరాడుతున్న క్లాసెన్, మర్క్రమ్..

ABN , First Publish Date - 2023-05-04T22:41:53+05:30 IST

ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH), కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పేలవ ఆటతీరుతో మరోసారి అభిమానులను నిరాశపరిచింది. కోల్‌కత్తా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో..

SRH vs KKR Live: మళ్లీ నిరాశపర్చిన బ్రూక్.. పోరాడుతున్న క్లాసెన్, మర్క్రమ్..

Live News & Update

  • 2023-05-04T10:40:00+05:30

    రూ.13 కోట్లు వెచ్చించి మరీ బ్రూక్‌ను వేలంలో దక్కించుకోవడంపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్

    ఒక్క మ్యాచ్‌లో సెంచరీ తప్ప సరైన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడని బ్రూక్

    ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి డకౌట్‌గా పెవిలియన్ చేరిన బ్రూక్

    54 పరుగుల వద్ద బ్రూక్ వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

    53 పరుగుల వద్ద హైదరాబాద్ మూడో వికెట్ ఫట్

    37 పరుగుల వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్ డౌన్

    29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

    నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు

    ఉప్పల్ స్టేడియంలో ఖాళీగా కనిపిస్తున్న చాలా సీట్లు

    మ్యాచ్‌పై ఆసక్తి కనబర్చని క్రీడాభిమానులు

    ఉప్పల్‌లో కోల్‌కత్తా, హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్

    ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH), కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పేలవ ఆటతీరుతో మరోసారి అభిమానులను నిరాశపరిచింది. కోల్‌కత్తా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు 9 ఓవర్లకు 69 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ 9 పరుగులు, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు, హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగారు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములతో నిరాశపరుస్తుండటంతో ఉప్పల్ స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసేందుకు అభిమానులు అంత ఆసక్తి కనబర్చకపోవడం కొసమెరుపు. స్టేడియంలో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయంటే హైదరాబాద్ జట్టు మ్యాచ్‌లపై క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎంతలా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్లే-ఆఫ్ ఆశలు సన్‌రైజర్స్‌కు 99 శాతం దూరమైనట్టే.