WPL 2023: లారా, ఆష్లీ అర్ధ సెంచరీలు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

ABN , First Publish Date - 2023-03-16T21:17:06+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో జరుగుతున్న పోరులో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) ఇన్నింగ్స్ ముగిసింది. లారా వోల్వార్డ్, ఆష్లీ గార్డనర్ అర్ధ

WPL 2023: లారా, ఆష్లీ అర్ధ సెంచరీలు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

ముంబై: ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో జరుగుతున్న పోరులో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) ఇన్నింగ్స్ ముగిసింది. లారా వోల్వార్డ్, ఆష్లీ గార్డనర్ అర్ధ సెంచరీలు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ నాలుగు పరుగుల వద్దే సోఫియా డంక్లీ (4)ని తొలి వికెట్‌ రూపంలో కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్(Harleen Deol) సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా అడ్డుకుంది.

33 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన తర్వత రెండో వికెట్‌గా వెనుదిరిగింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆష్లీ గార్డనర్.. లారాతో కలిసి పరుగులు పెంచే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కలిసి అడపాదడపా బౌండరీలు బాదుతూ వేగం పెంచారు. ఈ క్రమంలో 45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 57 పరుగులు చేసిన లారా.. అరుంధతి రెడ్డి బౌలింగులో బౌల్డ్ అయింది. మరోవైపు, ఆష్లీ మాత్రం ఏమాత్రం జోరు తగ్గకుండా పరుగులు పిండుకునే ప్రయత్నం చేసింది. 33 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

**************************

* RCB: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్!

* Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

* WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

Updated Date - 2023-03-16T21:17:06+05:30 IST