Share News

Mohammed Shami: వరల్డ్ కప్‌లో పేసర్ మహ్మద్ షమీ రికార్డ్.. ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ సాధించని ఫీట్ ఇది

ABN , First Publish Date - 2023-10-23T12:40:58+05:30 IST

ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై చెలరేగిన స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ.. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా రాణించాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్‌ను 273 పరుగులకే కట్టడి చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు.

Mohammed Shami: వరల్డ్ కప్‌లో పేసర్ మహ్మద్ షమీ రికార్డ్.. ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ సాధించని ఫీట్ ఇది

ధర్మశాల: ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై చెలరేగిన స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ.. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా రాణించాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్‌ను 273 పరుగులకే కట్టడి చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శన ద్వారా వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డును షమీ నెలకొల్పాడు.


వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు 5 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. 2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై మొదటి 5 వికెట్లు సాధించగా తాజాగా న్యూజిలాండ్‌పై మరోసారి 5 వికెట్ల ఫీట్ సాధించాడు. కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ భారత్ తరుపున 5 వికెట్లు తీశారు. కానీ వరల్డ్ కప్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మాత్రం మహ్మద్ షమీనే. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడుసార్లు వరల్డ్ కప్‌లో 5 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్‌లో స్టార్క్ మినహా ఇతర బౌలర్లు ఎవరూ 2 సార్లు కంటే ఎక్కువ 5 వికెట్స్ రికార్డ్ సాధించలేకపోయారు.


కాగా మహ్మద్ షమీ 2015లో తొలిసారి ప్రపంచకప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచ కప్‌లో అతడు సాధించిన మొత్తం వికెట్ల సంఖ్య 36గా ఉంది. న్యూజిలాండ్‌పై నమోదు చేసిన 5/54 అత్యుత్తమ గణాంకంగా ఉంది. ఒకానొక దశలో న్యూజిలాండ్ స్కోరు 300 దాటడం ఖాయమరి అనిపించింది. కానీ కీలకమైన వికెట్లు పడగొట్ట ఆ జట్టు స్కోరుని నియంత్రించడంలో షమీ అత్యంత కీలకపాత్ర పోషించాడు.

Updated Date - 2023-10-23T12:40:58+05:30 IST