Jio Cinema: క్రికెట్ అభిమానులకు మళ్లీ గుడ్‌న్యూస్.. ఆ సిరీస్ కూడా ఉచితంగా స్ట్రీమింగ్

ABN , First Publish Date - 2023-09-14T17:02:24+05:30 IST

ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న మూడు వన్డేల సిరీస్‌ను జియో సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది.

Jio Cinema: క్రికెట్ అభిమానులకు మళ్లీ గుడ్‌న్యూస్.. ఆ సిరీస్ కూడా ఉచితంగా స్ట్రీమింగ్

క్రికెట్ అభిమానులకు జియో సినిమా మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ ఏడాది మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌ను మొబైళ్లలో ఉచితంగా స్ట్రీమింగ్ చేసి జియో సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఆసక్తికర సిరీస్‌ను అభిమానులకు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న మూడు వన్డేల సిరీస్‌ను జియో సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటి నుంచే ఈ సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: IND vs BAN: ప్రయోగాలకు వేళాయే.. కోహ్లీ, హార్దిక్ ఔట్.. సూర్య, శ్రేయస్‌కు చోటు

ఆసియా కప్‌లో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా టైటిల్ విజేతగా నిలవడం కోసం పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడనుంది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకుంది. జియో సినిమా ఈ కంపెనీలో భాగం కావడంతో భారత్-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ కవరేజ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని భావించింది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ఈ మ్యాచ్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది. కాగా ఐపీఎల్‌కు వచ్చిన ఆదరణ దృష్ట్యా జియో సినిమా మరోసారి అభిమానులకు ఉచిత స్ట్రీమింగ్ అందించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-14T17:02:24+05:30 IST