WPL 2023: టాస్ నెగ్గిన గుజరాత్.. ముంబై వరుస విజయాలకు బ్రేక్ వేసేనా?

ABN , First Publish Date - 2023-03-14T19:17:39+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో వరుస విజయాలతో ఊపుమీదున్న ముంబై ఇండియన్(Mumbai Indians)-ఒకే ఒక్క విజయంతో కింది

WPL 2023: టాస్ నెగ్గిన గుజరాత్.. ముంబై వరుస విజయాలకు బ్రేక్ వేసేనా?

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో వరుస విజయాలతో ఊపుమీదున్న ముంబై ఇండియన్(Mumbai Indians)-ఒకే ఒక్క విజయంతో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) మరికాసేపట్లో తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన జెయింట్స్ వ్యూహాత్మకంగా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) సారథ్యంలోని ముంబై జట్టు జైత్ర యాత్రను కొనసాగించాలని చూస్తుండగా, ముంబైని మట్టి కరిపించడం ద్వారా ఓటమి రుచి చూపించాలని స్నేహ్ రాణా(Sneh Rana) జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే, వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న జెయింట్స్ ముంబైని ఏ మేరకు ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరమే.

గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. లారా, జార్జియా స్థానాల్లో డంక్లీ, బెల్ జట్టులోకి వచ్చారు. ముంబై మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

Updated Date - 2023-03-14T19:17:39+05:30 IST