Asian Games 2023: దుమ్ములేపుతున్న భారత షూటర్లు.. మరో స్వర్ణం కైవసం.. ఇప్పటివరకు ఎన్ని పతకాలు గెలిచారంటే..?

ABN , First Publish Date - 2023-10-01T11:25:44+05:30 IST

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మెన్స్ ట్రాప్ టీమ్ ఈవెంట్ విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. డారియస్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది.

Asian Games 2023: దుమ్ములేపుతున్న భారత షూటర్లు.. మరో స్వర్ణం కైవసం.. ఇప్పటివరకు ఎన్ని పతకాలు గెలిచారంటే..?

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మెన్స్ ట్రాప్ టీమ్ ఈవెంట్ విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. డారియస్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. డారియస్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌లో అడుగుపెట్టారు. ఆసియా క్రీడలు 2023లో షూటింగ్‌లో భారత్‌కు ఇది 21వ పతకం. షూటింగ్‌లో 7వ బంగారు పతకం. ఫైనల్ పోరులో కువైట్, చైనా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ భారత షూటర్లు సత్తా చాటారు. స్వర్ణం సాధించిన భారత్ ఫైనల్‌లో 361 పాయింట్స్ సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 352 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచిన కువైత్ సిల్వర్ మెడల్, 346 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచిన చైనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాయి. ఇక ఉమెన్స్ ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో మనీషా కీర్, ప్రీతి రజక్, రాజేశ్వరి కుమారితో కూడిన భారత జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. దీంతో షూటింగ్‌లో భారత్ పతకాల సంఖ్య 21కి చేరుకుంది. అందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. ఇక ఉమెన్స్ గోల్ప్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారిణి అదితి అశోక్ చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అదితి ఆసియా క్రీడల్లో గోల్ప్ పతకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 41కి చేరుకుంది.

Updated Date - 2023-10-01T11:28:06+05:30 IST