Wife: 4 నెలల తర్వాత తిరిగొచ్చిన తండ్రి.. ఇంట్లో కనిపించని చిన్న కూతురు.. భార్య ప్రవర్తనపై డౌట్.. చివరకు బయటపడిన షాకింగ్ నిజం..!
ABN , First Publish Date - 2023-07-06T13:33:04+05:30 IST
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడులో ఉద్యోగం (Job) చేస్తుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడులో ఉద్యోగం (Job) చేస్తుంటాడు. దాంతో నెలల తరబడి తన కుటుంబానికి దూరంగా ఉండేవాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం సొంతూరిలోనే ఉండేవారు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత ఇటీవల ఇంటికి తిరిగొచ్చిన అతడికి 8నెలల వయసు గల తన చిన్న కూతురు కనిపించలేదు. ఇంట్లో అంత వెతికాడు. కానీ, చిన్నారి జాడ ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత భార్యను అడిగితే సరియైన సమాధానం రాలేదు. ఆమె ప్రవర్తన కూడా అనుమానాస్పందంగానే ఉంది. దాంతో చేసేదేమిలేక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మొదట భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆమె షాకింగ్ విషయం బయటపెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని ఖుంటా పరిధిలోని మహూలియా గ్రామం (Mahulia village) లో ముషు, కరామి ముర్ము (Karami Murmu) దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు ఉంటారు. అయితే, ముషు ఉద్యోగరీత్య తమిళనాడులో (Tamil Nadu) ఉంటున్నాడు. నెలల తరబడి అక్కడే ఉండేవాడు. దాంతో ఇక్కడ కరామి, తన ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగానే ఉండేది. వారితో ప్రతిరోజు ముషు ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే ముషుకు ఇంట్లో తన 8నెలల చిన్న కూతురు కనిపించలేదు. భార్య (Wife) ను అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పింది. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముషు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మొదట భార్య కరామి ముర్మును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆమె షాకింగ్ విషయం చెప్పింది.
Viral: కండోమ్స్ ఆర్డర్ ఇచ్చి.. డెలివరీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. కొడుకు ఏం పంపాడా అని ఇంట్లో వాళ్లు ఓపెన్ చేస్తే..!
తన కూతురును ఓ మహిళకు రూ.800 లకు అమ్మేసినట్లు తాపీగా సెలవిచ్చింది. ఫులామణి మరాండి అనే మహిళకు కూతురిని విక్రయించినట్లు తెలిపింది. దాంతో పోలీసులు వెంటనే మరాండి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వద్ద చిన్నారి ఉండడం గుర్తించారు. పాపను తీసుకుని తండ్రి ముషు (Mushu) కు అప్పగించారు. ఆ తర్వాత మరాండిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కరామి తనకు నెల రోజుల కింద చిన్నారిని విక్రయించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. తన కూతురిని పోషించే స్తోమత లేక అమ్మేస్తున్నట్లు చెప్పిందట. దాంతో మరాండి రూ.800 చెల్లించి పాపను తీసుకుంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.