Crime News: భర్త చనిపోతే రూ.20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని పక్కా స్కెచ్.. అంతా భార్య పనేనని 3 రోజుల్లోనే పోలీసులు ఎలా తేల్చారంటే..

ABN , First Publish Date - 2023-04-10T16:40:29+05:30 IST

పచ్చని సంసారంలో నిప్పులు పోసుకోవడమంటే ఇదేనేమో?. అదొక అందమైన ఫ్యామిలీ. పిల్లాపాపలతో కుటుంబం సంతోషంగా సాగిపోతోంది. బిడ్డల భవిష్యత్‌కు ఉపయోగపడతాయని ఇన్సూరెన్స్ కూడా కట్టాడు. ఇంత బాగా సాగిపోతున్న తరుణంలో ఓ నిర్ణయం

Crime News: భర్త చనిపోతే రూ.20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని పక్కా స్కెచ్.. అంతా భార్య పనేనని 3 రోజుల్లోనే పోలీసులు ఎలా తేల్చారంటే..
Crime News

పచ్చని సంసారంలో నిప్పులు పోసుకోవడమంటే ఇదేనేమో?. అదొక అందమైన ఫ్యామిలీ. పిల్లాపాపలతో కుటుంబం సంతోషంగా సాగిపోతోంది. బిడ్డల భవిష్యత్‌కు ఉపయోగపడతాయని ఇన్సూరెన్స్ కూడా కట్టాడు. ఇంత బాగా సాగిపోతున్న తరుణంలో ఓ నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది.

భర్తతో ఆమెకు మంచి సంబంధం ఉంది. ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. కుటుంబం సాఫీగా సాగుతోంది. ఉన్నట్టుండి సడన్‌గా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. అప్పుడే పరిచయమైన ఆ వ్యక్తితోనే మంచి భవిష్యత్ ఉంటుందని భావించింది. ప్రియుడితో హ్యాపీగా ఉండాలంటే డబ్బుకు కూడా లోటు ఉండకూడదని అనుకుంది. అంతే తడువుగా ప్రేమికుడితో కలిసి ఓ దారుణమైన కుట్రకు తెరలేపింది. భర్త చనిపోతే 20 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందన్న ఆశతో భర్త వాసిల్ సూరిన్(45)ను రాడ్‌తో కొట్టి చంపేసింది (woman). జార్ఖండ్‌ (Jharkhand)లో ఈ దారుణం చోటుచేసుకుంది.

వాసిల్ సూరిన్.. మరియన్ సూరిన్ భార్యాభర్తలు. జార్ఖండ్‌లోని రానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోడే గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్నారు. ఖుంటి జిల్లాలోని నింధియా గ్రామానికి చెందిన 40 ఏళ్ల సైమన్‌తో మరియన్ సూరిన్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా మారిపోయింది. దీంతో మరియన్ సూరిన్.. భర్త (husband)ను వదిలేసి ప్రియుడితో (extramarrital affair) వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అంతే తమ ప్రేమకు అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలనుకుంది. సుఖంగా జీవించడానికి డబ్బు కూడా ఉంటే ఎలాంటి లోటు ఉండదని భావించి భర్త పేరు మీద ఉన్న 20 లక్షల బీమాను నొక్కేయాలని ప్రణాళిక వేసింది. అనుకున్న తడువు ప్రియుడితో కలిసి భర్తను రాడ్‌తో కొట్టి చంపేసింది.

హత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి 72 గంటల్లోనే నిందితులిద్దర్నీ పట్టుకున్నారు. నిందితులు మరియన్ సూరిన్, ఆమె ప్రేమికుడు సైమన్‌ను అరెస్ట్ చేశారు. భర్త పేరు మీద ఉన్న బీమా సొమ్ము కాజేయాలన్న ఉద్దేశంతోనే భార్యే.. భర్తను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. తండ్రి మృతి... భార్య జైలు పాలు కావడంతో పిల్లలు వీధిన పడ్డారు. జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టుకుంటుందంట.. మూఢురాలైతే తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటుందన్న సామెతకు ఈమె జీవితం సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Viral Video: చేతులెత్తి మొక్కుతున్నాం.. వదిలేయండన్నా వినని గ్రామస్తులు.. అక్కాతమ్ముళ్లను చెట్టుకు కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టడం వెనుక..

Updated Date - 2023-04-10T16:40:29+05:30 IST