Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-24T14:54:42+05:30 IST

భార్యాభర్తలన్నాక చెరొకపని చేస్తూ జీవితపు బండి ముందుకు లాగేస్తుంటారు. కొన్ని సార్లు మంచివో, చెడ్డవో ఊహించని పనులు చేసి షాకులిస్తుంటారు. ఓ వ్యక్తి తన భార్యతో సరుకులు తీసుకొస్తానని బయటకెళ్ళి ఇలాగే చేశాడు.

Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

భార్యాభర్తలన్నాక చెరొకపని చేస్తూ జీవితపు బండి ముందుకు లాగేస్తుంటారు. కొన్ని సార్లు మంచివో, చెడ్డవో ఊహించని పనులు చేసి షాకులిస్తుంటారు. ఓ వ్యక్తి తన భార్యతో సరుకులు తీసుకొస్తానని బయటకెళ్ళాడు. ఆ తరువాత అతను తిరిగొచ్చి ఆమెకు ఫోన్ చేసి 'సరుకులు తీసుకొచ్చాను బయటకొచ్చి తీసుకో'అని చెప్పాడు. ఆమె బయటకు రాగానే అతను చేసిన పనికి షాకైంది. ఆమె ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఈ వీడియో పట్ల విపరీతంగా ఆకర్షింపబడుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అర్థం చేసుకుంటే భార్యాభర్తల బంధం(Husband wife relation) ఎంతో గొప్పగా మారుతుంది. తల్లిదండ్రుల ప్రేమ తరువాత అంతటి ప్రేమను, బాధ్యతను కలిగి ఉండేది భార్యాభర్తల బంధమే. దీనికి కులం, మతం, దేశం అనే బేధం లేదు. పాకిస్తాన్(Pakistan) లో భిలాల్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(social media influencer) ఉన్నాడు. ఇతను లాహోర్(Lahore) నగరంలో నివసిస్తున్నాడు. ఇతనికి ఓ చమత్కారపు ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా 'నేను సరుకులు తీసుకొస్తాను' అని భార్య బేగం దువా సిద్దిఖీకి చెప్పి బయటకు వెళ్ళాడు. కొంతసేపటి తరువాత అతను భార్యకు ఫోన్ చేసి 'సరుకులు తెచ్చాను బయటకు వచ్చి తీసుకో' అని ఫోన్ చేశాడు. ఆమె బయటకు రాగానే భర్త కారులోనే ఉన్నాడు. దీంతో ఆమె కారు దగ్గరకు వెళ్ళింది. వెంటనే బిలాల్ ఖాన్ ఆమెకు కనిపించకుండా దాచిన గులాబి పువ్వును బయటకు తీసి రొమాంటిక్ గా ఆమెకు ఇచ్చాడు(Husband gave rose to wife). దీంతో ఆమె సిగ్గుపడిపోయింది. అదే సమయంలో అతను కారులోనే ఉంచిన అరటిపండ్ల కవర్ ఆమె చూసింది. పువ్వు ఇవ్వగానే ఆమె ఏమి చెబుతుందో అని అతను ఆసక్తిగా ఎదురుచూశాడు. అయితే బేగం దువా మాత్రం భర్తతో 'లోపల స్టవ్ మీద మినప్పప్పు ఉంది, ఇక్కడ మీ ప్రేమ మాత్రం ముగియడం లేదు. సరే ఆ అరటిపండ్లు బయటకు తీయండి' అని ఆమె సరదాగా మాట్లాడుతూ భర్త నుండి అరటిపండ్ల కవర్ అందుకుంది.

Viral Video: బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపేసి.. వెంటనే తాళం లాగేసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన ట్విస్టుతో అంతా షాక్..!


ఈ వీడియోను పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ బిలాల్ ఖాన్ bilalkhan228 తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. 'పెళ్ళి తరువాత జీవితం .. బేగం జీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అని క్యాప్షన్ లో పొందుపరిచాడు. పెళ్లి, పిల్లలు, సంసారం వీటిలో భార్యాభర్తలు వారిలో ఉన్నరొమాంటిక్ యాంగిల్ మరచిపోతారు. కానీ కాసిన్ని రొమాంటిక్ సందర్భాలు కూడా వారి మధ్య ఉండటం చాలా అవసరం. ఈ వీడియో అందరికీ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో పాకిస్తాన్ లో మాత్రమే కాకుండా భారత్ లో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది భార్యాభర్తలు తాము అన్యోన్యంగా, ప్రేమగా ఉన్న రోజులను గుర్తుచేసుకుంటున్నారు. 'దేవుడు మిమ్మల్ని దీవించాలి' అని ఒకరు కామెంట్ చేశారు. 'మీ జంట చాలా అందంగా ఉంది, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని ఢిల్లీలో ఉన్న నేను కోరుకుంటున్నాను' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా ప్రాంతీయ భేదాల్లేకుండా ఈ వీడియో ఆదరణ పొందుతోంది.

Viral Video: ఇతడికేమైనా అద్భుత శక్తులున్నాయా ఏంటీ..? నీళ్లపై ఇలా పడుకున్నా అస్సలు మునగడం లేదేంటి..?


Updated Date - 2023-07-24T14:54:42+05:30 IST