Shocking Twist: 15 ఏళ్ల బాలికది ఆత్మహత్యే అని కేసును మూసేసేందుకు సిద్ధమైన పోలీసులు.. సరిగ్గా 117వ రోజు షాకింగ్ ట్విస్ట్.. ఆ మెసేజ్‌లను చూసి..!

ABN , First Publish Date - 2023-05-05T11:00:08+05:30 IST

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ బాలిక ఈ ఏడాది జనవరి 2న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది.

Shocking Twist: 15 ఏళ్ల బాలికది ఆత్మహత్యే అని కేసును మూసేసేందుకు సిద్ధమైన పోలీసులు.. సరిగ్గా 117వ రోజు షాకింగ్ ట్విస్ట్.. ఆ మెసేజ్‌లను చూసి..!

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ బాలిక ఈ ఏడాది జనవరి 2న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. మొదట్లో అందరూ ఇది మామూలు సూసైడ్‌గానే అనుకున్నారు. పోలీసులు కూడా దాదాపు ఇదే అనుకుని కేసును మూసివేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో సరిగ్గా 117వ రోజున ఓ షాకింగ్ ట్విస్ట్ (Shocking Twist) బయటకు వచ్చింది. ఎవరూ ఊహించని ఆ ట్విస్ట్‌తో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌ పరిధిలోని అరేరా హిల్స్‌లో ఆరుగురు కుటుంబ సభ్యులు గల ఓ ప్యామిలీ నివాసం ఉంటోంది. భార్యాభర్తలు వారికి నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలలో చిన్నమ్మాయి అంజలి (పేరు మార్చడం జరిగింది). ఆమెకు 15ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎంతో చలాకీగా, అందరితో ఇట్టే కలిసిపోయే తత్వం అంజలిది. దాంతో ఇరుగుపొరుగున ఉండేవారితో ఆమె ఎంతో కలివిడిగా ఉండేది. అందరూ ఆమెతో అంతే అప్యాయంగా మాట్లాడేవారు కూడా. ఈ క్రమంలో 2023 జనవరి 2న ఉదయం ఇంట్లోవాళ్లు ఎవరి పనిపై వారు బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో అంజలి మాత్రమే ఉంది.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

అయితే, 11 గంటల ప్రాంతంలో డైలీ వాటర్ క్యాన్ వేసేందుకు వచ్చే వ్యక్తి.. ఇంటికి వచ్చి ఎంతసేపు డోర్ కొట్టిన తీయలేదు. దాంతో ఆ వ్యక్తి అంజలి తండ్రికి ఫోన్ చేశాడు. వెంటనే ఆయన అంజలికి ఫోన్ చేశాడు. కానీ, ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఇంటికి దగ్గరలోనే పనిచేసే కుమారుడికి ఇంటికి వెళ్లమని చెప్పాడు. తండ్రి చెప్పడంతో కుమారుడు వెళ్లి చూశాడు. డోర్స్ లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో కిటికీలోంచి అంజలిని పిలవాలని వాటిని తెరిచాడు. అంతే.. అంజలి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రికి విషయం చెప్పాడు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టి హూటాహూటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అక్కడ శవపరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.

Viral Video: ఈ అమ్మాయ్ మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి..? డోర్ వద్ద కుర్రాళ్లతో కిక్కిరిసిపోయి బస్సులోకి వెళ్లడానికి దారే లేదని..


ఇక పోలీసులు అంజలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారు తమకు తెలిసిన విషయాలు చెప్పారు. కానీ, ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది మాత్రం తెలియలేదు. పోలీసులు అన్నివిధాల దర్యాప్తు చేసిన ఎక్కడ వారికి చిన్న క్లూ కూడా దొరకలేదు. దాంతో సాధారణ సూసైడ్‌గానే నిర్ధారణకు వచ్చి, కేసును క్లోజ్ చేసేద్దామని అనుకున్నారు. అయితే, ఘటన జరిగిన సరిగ్గా 117వ రోజు అంటే.. ఏప్రిల్ 30న ఫోరెన్సిక్ రిపోర్ట్‌ (Forensic Science Laboratory) ద్వారా షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. అంజలి ఆత్మహత్యకు ముందు రేప్‌కు గురైనట్లు రిపోర్ట్‌లో వచ్చింది.

Viral Video: సైకిల్‌పై బాలిక.. స్కూటీపై పోలీస్.. స్కూలు నుంచి వెళ్తోంటే వెంటపడుతున్నాడని.. సైలెంట్‌గా వచ్చి షాకిచ్చిన మహిళ..!


అంతే.. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దాంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో గుర్తు తెలియని నిందితుడిపై సెక్షన్ 376, పోస్కో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అంజలికి ఒక ఏడాది కాలంగా అభయ్ అనే అబ్బాయితో పరిచయం ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ చాట్ ద్వారా తెలిసింది. ఆమె ఆత్మహత్యకు ముందు కూడా చివరిసారిగా అతడితోనే చాట్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు.

Uber Driver: హ్మ్.. నీకు ఇంగ్లీషు కూడా వచ్చా..? ఏం చదువుకున్నావేంటని డ్రైవింగ్ చేస్తున్న యువతిని అడిగిన కస్టమర్.. ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-05-05T11:00:08+05:30 IST