Viral Video: ఈ అమ్మాయ్ మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి..? డోర్ వద్ద కుర్రాళ్లతో కిక్కిరిసిపోయి బస్సులోకి వెళ్లడానికి దారే లేదని..

ABN , First Publish Date - 2023-05-04T13:25:27+05:30 IST

సాధారణంగా సిటీ బస్సులలో (City Buses) కాలేజీ కుర్రాళ్లు కాలు పెట్టడానికి కూడా సందులేకపోయిన వేలాడుతూ మరీ ఫుట్‌బోట్ ప్రయాణాలు చేస్తుండడం మనం చాలాసార్లు చూసి ఉంటాం.

Viral Video: ఈ అమ్మాయ్ మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి..? డోర్ వద్ద కుర్రాళ్లతో కిక్కిరిసిపోయి బస్సులోకి వెళ్లడానికి దారే లేదని..

Viral Video: సాధారణంగా సిటీ బస్సులలో (City Buses) కాలేజీ కుర్రాళ్లు కాలు పెట్టడానికి కూడా సందులేకపోయిన వేలాడుతూ మరీ ఫుట్‌బోట్ ప్రయాణాలు చేస్తుండడం మనం చాలాసార్లు చూసి ఉంటాం. అలాగే రద్దీగా ఉండే బస్సులలో జనాలు ఎన్నో వ్యయప్రయాసలతో ప్రయాణించడం కూడా చూశాం. అంతేందుకు బస్సు కదులుతుంటే కొందరు పరిగెత్తుకువచ్చి మరీ ఎక్కేస్తుండడం కూడా గమనించే ఉంటాం. అయితే, ఇప్పుడు మీరు చూడబోయే ఓ అమ్మాయి బస్సు ఎక్కే ఈ వీడియో మాత్రం కచ్చితంగా మీకు షాక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయ్ మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి..? అని అనకుండా కూడా ఉండలేరు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ బస్సు (Bus) జనాలతో పూర్తి నిండిపోయి ఉంది. అప్పటికే అది నెమ్మదిగా కదలడం కూడా స్టార్ట్ అయింది. ఇక బస్సు డోర్ వద్ద కుర్రాళ్లు కిక్కిరిసిపోయి ఉన్నారు. అంతలోనే ఓ అమ్మాయి (Girl) పరిగెత్తుకు వచ్చి మరి కదులుతున్న బస్సును అందుకుంది. ఎగిరి కిటికీ చువ్వలను అందుకుని.. తన చేతిని లోపల కూర్చున తమవారికి అందించింది. ఆ తర్వాత కాళ్ల సహాయంతో కిటికీ వరకు ఎక్కింది. అక్కడి నుంచి కిటికీ ద్వారా రెండు కాళ్లను బస్సులో పెట్టి మరీ లోపలికి వెళ్లిపోవడం వీడియోలో మనం చూడొచ్చు. అలా ఆ అమ్మాయి.. అబ్బాయిలను తలదన్నేరీతిలో కదులుతున్న బస్సు ఎక్కడం చూసిన చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది (Video goes Viral). ఇప్పటివరకు సుమారు 2లక్షల మంది వరకు వీక్షించారు.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

Updated Date - 2023-05-04T13:25:27+05:30 IST