హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని మృతి.. అనుమానంగానే ఆ తల్లిదండ్రులు కూతురి బ్యాగ్‌ను పరిశీలిస్తే..

ABN , First Publish Date - 2023-02-01T18:30:41+05:30 IST

హాస్టల్‌లో ఉన్న తమ కూతురు సంతోషంగా చదువుకుంటోందని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే ఓ రోజు అనుకోకుండా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ మీ కూతురు చనిపోయింది’’ అని సడన్‌గా చెప్పడంతో ఒక్కసారిగా..

హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని మృతి.. అనుమానంగానే ఆ తల్లిదండ్రులు కూతురి బ్యాగ్‌ను పరిశీలిస్తే..

హాస్టల్‌లో ఉన్న తమ కూతురు సంతోషంగా చదువుకుంటోందని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే ఓ రోజు అనుకోకుండా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ మీ కూతురు చనిపోయింది’’ అని సడన్‌గా చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చివరకు కూతురుకు సంబంధించిన బ్యాగును ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. అనుమానంగానే తెరచి చూశారు. అయితే అందులోని దృశ్యాన్ని చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోపరిధి జలౌన్ ప్రాంతానికి చెందిన జస్రామ్ అనే వ్యక్తికి ప్రియ అనే కుమార్తె ఉంది. బాలిక (girl) స్థానికంగా ఉన్న హాస్టల్‌లో ఉంటూ ఓ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటోంది. జనవరి 20న బాలిక హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి (Suspicious death) చెందింది. స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇదిలావుండగా, బాలికకు సంబంధించిన బ్యాగును ఇంటికి వెళ్లి తెరచి చూసిన తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. అందులోని ఓ ఫ్యాంట్‌పై రక్తపు మరకలు (Blood stains) ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

వైజాగ్ బీచ్ ‘కథ’ రిపీట్.. నది ఒడ్డున స్కూటీ, సూసైట్ లేఖ.. రెండ్రోజుల పాటు యువతికై వెతుకులాట.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిందితులు ఎవరో త్వరగా తేల్చాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు బాలిక దుస్తులకు ఎలాంటి రక్తపు మరకలు కాలేదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. పాఠశాలలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటూ బాలిక బంధువులంతా ఆందోళన చేపట్టారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

కూతురు కోసం ఐదు వేల రూపాయలు అప్పు చేసిన తల్లి.. ఓ రోజు ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడిన అసలు రహస్యం..

Updated Date - 2023-02-01T18:30:45+05:30 IST