వైజాగ్ బీచ్ ‘కథ’ రిపీట్.. నది ఒడ్డున స్కూటీ, సూసైట్ లేఖ.. రెండ్రోజుల పాటు యువతికై వెతుకులాట.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-02-01T15:56:16+05:30 IST

వైజాగ్ సాయిప్రియ అదృశ్యం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మధ్యప్రదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే స్టోరీలో కాస్త చేంజ్ ఉంది. ఇంతకీ ఈ యువతి ఎలాంటి ప్లాన్ వేసిందంటే..

వైజాగ్ బీచ్ ‘కథ’ రిపీట్.. నది ఒడ్డున స్కూటీ, సూసైట్ లేఖ.. రెండ్రోజుల పాటు యువతికై వెతుకులాట.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

వైజాగ్ సాయిప్రియ (Vizag Saipriya) అదృశ్యం కేసు 2022 జూలైలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ.. ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు బీచ్ మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు బెంగళూరులో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మధ్యప్రదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే స్టోరీలో కాస్త చేంజ్ ఉంది. ఇంతకీ ఈ యువతి ఎలాంటి ప్లాన్ వేసిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మంసౌర్ పరిధికి చెందిన 22ఏళ్ల యువతి (young woman) స్థానిక పీజీ కళాశాలలో ఎంకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు వెళ్లే సమయంలో స్థానిక ప్రాంతానికి చెందిన ఆర్యన్ అభినందన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆర్యన్ పెద్దగా చదువుకోకున్నా మాటలు, ప్రవర్తన నచ్చి.. యువతి అతడికి దగ్గరైంది. చివరకు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశంతో పారిపోయి పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం టీవీ సీరియల్ చూసిన యువతి.. పక్కా స్కెచ్ వేసింది. అనంతరం తన ప్రియుడితో మాట్లాడి, ఇద్దరూ కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. జనవరి 28న ఉదయం కోచింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, స్కూటీలో బయలుదేరింది. సమీపంలోని కలభటా డ్యామ్ వద్దకు చేరకుంది.

ఇద్దరు యువకుల ప్రేమాయణం.. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన ఓ కుర్రాడి తల్లి.. అసలేం జరిగిందంటే..

women-missing.jpg

అక్కడ అప్పటికే ఆర్యన్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఓ సూసైడ్ నోట్ (Suicide note) రాసి, స్కూటీలో పెట్టారు. కాసేపటికి ఆర్యన్.. యువతి తండ్రికి ఫోన్ చేసి ‘‘ మీ కూతురు డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.. నేను చూశాను.. మీరు వెంటనే వచ్చేయండి’’.. అని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూతురు ఆత్మహత్య విషయం తెలుకున్న యువతి తండ్రి కంగారుపడి.. పోలీసులకు సమాచారం అందించాడు. సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పది మంది డైవర్ల సాయంతో డ్యామ్ మొత్తం వెతికించారు. అయితే వారు ఎంత వెతికినా యువతి జాడ మాత్రం కానరాలేదు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తిపై అనుమానం వచ్చింది. చివరకు ఫోన్ నంబర్ ఆధారంగా ఇద్దరూ రాజస్థాన్‌లో (Rajasthan) ఉన్నట్లు గుర్తించి, అక్కడికి చేరకున్నారు.

కూతురు కోసం ఐదు వేల రూపాయలు అప్పు చేసిన తల్లి.. ఓ రోజు ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడిన అసలు రహస్యం..

అయితే ప్రేమికులిద్దరూ అప్పటికే మందసౌర్ అనే ప్రాంతానికి వెళ్లిపోయిననట్లు తెలుసుకుని, చివరకు ఎలాగోలా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో యువతి మొదట తప్పుదారి పట్టించాలని చూసింది. తన కాళ్ల మీద తాను నిలబడి డబ్బు సంపాదించాలని అనుకున్నానని, ఇందుకోసం విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో తన స్నేహితుడి సాయం తీసుకున్నట్లు నమ్మించాలని ప్రయత్నించింది. అయితే మరింత లోతుగా విచారించిన పోలీసులు.. ఎట్టకేలకు వారి ప్రేమ కథను బట్టబయలు చేశారు. ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. చివరకు భర్త, ప్రేమికుడి మాటలతో తలలు పట్టుకున్న గ్రామ పెద్దలు..

Updated Date - 2023-02-01T15:56:21+05:30 IST