Viral Video: యువతిని పట్టుకుని లాగిన ఎలుగుబంటి.. వెన్నులో వణుకుపుడుతున్నా దాడి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిల మాస్టర్ ప్లాన్..!

ABN , First Publish Date - 2023-03-28T19:02:56+05:30 IST

ఇటీవలి కాలంలో చాలా మంది యువతీయువకులు వీలైనప్పుడల్లా ప్రకృతికి చేరువగా ఉండడానికి, అడవి జంతువులను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అడవి జంతువులతో ఎల్లవేళలా ఆహ్లాదంగా ఉండదు.

Viral Video: యువతిని పట్టుకుని లాగిన ఎలుగుబంటి.. వెన్నులో వణుకుపుడుతున్నా దాడి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిల మాస్టర్ ప్లాన్..!

ఇటీవలి కాలంలో చాలా మంది యువతీయువకులు వీలైనప్పుడల్లా ప్రకృతికి చేరువగా ఉండడానికి, అడవి జంతువులను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అడవి జంతువులతో (Wild Animals) ఎల్లవేళలా ఆహ్లాదంగా ఉండదు. వాటి మూడ్ బాగాలేకపోతే అవి మనుషుల ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడవు. తాజాగా వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అడవిలో టూర్‌కు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలను ఎలుగుబంటి (Bear) ఎలా భయపెట్టిందో చూస్తే షాక్ అవక తప్పదు (Animal Videos).

OddIy Terrifying అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వైరల్ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు ఫారెస్ట్ టూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఓ ఎలుగు బంటి వారిని చూసింది. వారికి చేరువగా వచ్చింది. ఆ ఎలుగుబంటి నుంచి ప్రాణాలతో తప్పించుకోవడానికి ఆ ముగ్గురు అమ్మాయిలు మాస్టర్ ప్లాన్ వేశారు. ఎటూ కదలకుండా విగ్రహాల్లా నిలబడిపోయారు. ఎలుగు ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి దగ్గరకు వచ్చి మొత్తం పరిశీలించింది. ఆమెను కదిపి చూసింది. అయినా ఆ అమ్మాయి మాత్రం చలనం లేకుండా ఉండిపోయింది (How to survive a bear attack).

ప్రియుడు అబద్ధం చెబుతున్నాడని డౌట్.. నేరుగా అతడి ఇంటికే వెళ్తే కనిపించిందో షాకింగ్ సీన్.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

కొద్ది సేపు అక్కడ తిరిగిన ఎలుగు బంటి తర్వాత వెనక్కి వెళ్లిపోయింది. ఆ ఎలుగుబంటి ఉండగానే ఆ అమ్మాయి సైలెంట్‌గా సెల్ఫీ కూడా తీసుకుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ``ఎలుగుబంటి దాడి నుంచి ఎలా తప్పించుకోవాలంటే.. కదలకుండా నిలబడి, కామ్‌గా ఉండాలి`` అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భయపడకుండా ఆ అమ్మాయిలు ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. రూ.10 వేల జరిమానా ముప్పును ముందే తప్పించుకోండి..!

Updated Date - 2023-03-28T19:02:56+05:30 IST