ప్రియుడు అబద్ధం చెబుతున్నాడని డౌట్.. నేరుగా అతడి ఇంటికే వెళ్తే కనిపించిందో షాకింగ్ సీన్.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-28T17:00:30+05:30 IST

ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.. కాలేజీలో పరిచయమైన యువకుడితో ప్రేమయాణం సాగిస్తోంది.. ఆ యువకుడికి అప్పటికే ఓ లవ్‌స్టోరీ, బ్రేకప్ కూడా ఉన్నాయి.. అతడి బ్రేకప్ గురించి తెలిసిన తర్వాతే అతడిని ఆ యువతి లవ్ చేసింది..

ప్రియుడు అబద్ధం చెబుతున్నాడని డౌట్.. నేరుగా అతడి ఇంటికే వెళ్తే కనిపించిందో షాకింగ్ సీన్.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.. కాలేజీలో పరిచయమైన యువకుడితో ప్రేమయాణం (Love) సాగిస్తోంది.. ఆ యువకుడికి అప్పటికే ఓ లవ్‌స్టోరీ, బ్రేకప్ (Break-Up) కూడా ఉన్నాయి.. అతడి బ్రేకప్ గురించి తెలిసిన తర్వాతే అతడిని ఆ యువతి లవ్ చేసింది.. అయితే తన ప్రియుడు మళ్లీ తన మాజీ ప్రేయసితో (ex-girl friend) మాట్లాడుతున్నట్టు ఆమెకు అనుమానం వచ్చింది.. తన ప్రియుడు అబద్ధం అడుతున్నట్టు గ్రహించి నేరుగా అతడి ఇంటికి వెళ్లిపోయింది.. అక్కడ ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

ఇండోర్‌లోని (Indore) ద్వారకాపూరిలో నివసిస్తున్న అనుష్క జైన్ అనే యువతి రోహన్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఏడాదిగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాగా, అంతకు ముందే అంజలి అనే యువతితో రోహన్ ప్రేమాయాణం సాగించి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత అనుష్కతో లవ్ జర్నీ ప్రారంభించాడు. అయితే మళ్లీ తన మాజీ ప్రేయసితో రోహన్ మాట్లాడుతున్నట్టు స్నేహితుల ద్వారా అనుష్క తెలుసుకుంది. రోహన్‌ను అడిగితే అదంతా అబద్ధం అని కొట్టిపడేశాడు. దీంతో నిజమేంటో తెలుసుకోవాలని సోమవారం సాయంత్రం నేరుగా రోహన్ ఇంటికి అనుష్క వెళ్లింది.

రూ.10 వేలు ఇవ్వు.. నీ ప్రేయసితో ఇక అస్సలు మాట్లాడను.. ఇదీ ప్రియుడికి ఓ స్నేహితుడు పెట్టిన కండీషన్.. చివరకు..

రోహన్ ఇంట్లో అనుష్కకు అంజలి కనిపించింది. దీంతో రోహన్‌ను, అంజలిని అనుష్క నిలదీసి గొడవ పెట్టుకుంది. అంజలిని కొట్టేందుకు ప్రయత్నించింది. దాంతో రోహన్, అంజలి కలిసి అనుష్కను చితక్కొట్టారు. తీవ్రంగా కొట్టిన తర్వాత అనుష్కను రోడ్డుపైకి తోసేశారు. తీవ్ర గాయాలపాలైన అనుష్క నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రోహన్‌పై, అంజలిపై ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు (Crime News).

నా భార్య పుట్టింటికి వెళ్లింది.. పార్టీ చేసుకుందాం రా.. అని ఫ్రెండును పిలిచాడో వ్యక్తి.. షాకింగ్ సీన్ చూసి పక్కింటి మహిళ కేకలు పెట్టడంతో..

Updated Date - 2023-03-28T17:00:30+05:30 IST