Share News

Viral Video: సరదాగా కారులో వెళ్తున్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇచ్చి ఏం చేసిందో చూడండి!!

ABN , Publish Date - Dec 21 , 2023 | 12:31 PM

పాపం ఆ కుటుంబం సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళితే.. ఏనుగు ఊహించని షాకిచ్చింది.

Viral Video: సరదాగా కారులో వెళ్తున్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇచ్చి ఏం చేసిందో చూడండి!!

ఏనుగు ప్రపంచంలోని అతి పెద్ద జంతువులలో ఒకటి. దీని మెదడు మనిషి మెదడును పోలి ఉంటుందని చెబుతారు. అందుకే మచ్చిక చేసుకుంటే ఏనుగు మనిషికి మించిన స్నేహాన్ని పంచుతుంది. కానీ అడవులలో సంచరించే ఏనుగులకు కోపం ఎక్కువ. ఆహారం వేటలో ఇవి చాలా తెలివితేటలు ప్రదర్శిస్తాయి. ఒక కుటుంబం కారులో సరదాగా వెళుతోంటే వారికి ఊహించని షాక్ తగిలింది. సడన్ గా ఏనుగు ఎంట్రీ ఇవ్వడంతో ఆ కుటుంబం భయాందోళనకు గురైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఆహారం కోసం, కమ్యూనికేషన్ కోసం అవి ప్రదర్శించే తెలివితేటలు మనుషులకు కూడా సాధ్యం కానివి అనిపిస్తుంది. శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్ (Yala National Park Sri lanka)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం యాలా నేషనల్ పార్క్ లో సఫారీకి వెళ్లింది. కారులో ప్రణాణిస్తూ పార్క్ అంతా చూస్తుండగా వారి కారుకు ముందు రహదారికి పక్కన పొదల్లో నుండి ఒక ఏనుగు(Elephant) సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ భారీ ఏనుగును చూడగానే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. వెనక సీట్లో ఉన్న అతని భార్య, కొడుకు కూడా భయపడ్డారు. అతను వెంటనే కారును రివర్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగు కారుకు చాలా దగ్గరగా ఉన్న పొదల్లోనుండి బయటకు రావడం వల్ల అది కారును సులువుగా సమీపించింది. డ్లైవింగ్ సీట్ పక్కన ఉన్న విండో తెరుచుకునే ఉండటంతో ఏనుగు తొండాన్ని కారులో పెట్టింది. డ్లైవింగ్ సీట్ వెనుక భాగం వరకు తొండాన్ని జొప్పించి దేనికోసమో తారాడుతుంది. అప్పటికి కానీ ఆ ఏనుగు ఆహారం కోసం అలా చేస్తోందనే విషయం అర్థం కాలేదు. కారు వెనుక సీట్లో కూర్చున్న మహిళ ఆ విషయాన్ని పసిగట్టి పక్కనే ప్యాకెట్ లో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ను బయటకు విసిరింది. ఏనుగు కారులోంచి తొండం బయటకు తీయగానే బ్రతుకు జీవుడా అనుకుంటూ కారును రివర్స్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆ కారులో ఉన్నవారు ఓ మై గాడ్ అని అనడం వినవచ్చు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. గంపెడు లాభాలు!


ఈ వీడియోను Irajw అనే ఇన్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'పాపం ఆ ఏనుగుకు ఆకలిగా ఉన్నట్టుంది. అందుకే అలా చేసింది' అని ఒకరన్నారు. 'ఆ ఏనుగు డోర్ డెలివరీ పద్దతిలో ఆహారం తీసుకుంటోంది' అని మరొకరు సరదా పంచ్ వేశారు. 'అడవిలోకి వెళ్లి ట్యాక్స్ కట్టకట్టనందుకు ఏనుగు చలానా వసూలు చేస్తోంది' అని మరొకరు అన్నారు. 'ఆ కుటుంబం కంగారు పడకుండా తెలివిగా వ్యవహరించింది. లేకపోతే ఏనుగు చేతిలో ఏమయ్యేవారో' అని మరికొందరు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Stomach bloating: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ చిట్కాలు పాటిస్తే ..!


Updated Date - Dec 21 , 2023 | 12:31 PM