Viral News: అద్దాలను మాత్రం వదిలేశాడా డాక్టర్.. కారు మొత్తాన్ని ఆవు పేడను పూసేశాడు.. ఎందుకీ పని అని ఆ డాక్టర్‌ను అడిగితే..

ABN , First Publish Date - 2023-04-26T19:50:05+05:30 IST

కారుకు ఆవు పేడ పూయడం ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? 'కారుకు ఆవు పేడ పూయడం ఏంటి? ఏ పల్లెటూరి వెర్రిబాగులోడో పిచ్చికొద్దీ అలా చేసుంటాడు' అని అనిపిస్తుందేమో.. కానీ..

Viral News: అద్దాలను మాత్రం వదిలేశాడా డాక్టర్.. కారు మొత్తాన్ని ఆవు పేడను పూసేశాడు.. ఎందుకీ పని అని ఆ డాక్టర్‌ను అడిగితే..

సాధారణంగా ఆవు పేడ ఎందుకు ఉపయోగిస్తాం? ఇల్లు అలకడానికి, పిడకలు చేయడానికి, పంటల్లో ఎరువు తయారు చేయడానికి ఉపయోగిస్తుంటాం. కానీ కారుకు ఆవు పేడ పూయడం ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? 'కారుకు ఆవు పేడ పూయడం ఏంటి? ఏ పల్లెటూరి వెర్రిబాగులోడో పిచ్చికొద్దీ అలా చేసుంటాడు' అని అనిపిస్తుందేమో.. కానీ ఏకంగా వైద్యవిద్య అభ్యసించి వైద్యుడిగా పనిచేస్తున్న ఓ డాక్టరే తన కారుకు ఆవు పేడను ఇంటి గోడలకు సున్నం పూసినట్టు పూసేశాడు.అలా ఎందుకు పూశారని ఆయన్ను అడిగితే అవాక్కయ్యే విషయం చెప్పాడు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం సాగర్(Sagar) జిల్లాలో బరువాఖేడా అనే గ్రామంలో సుశీల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఈయన వృత్తి పరంగా సాగర్ జిల్లా ఆరోగ్య సేతు ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్యుడిగా(homeopathy doctor) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు మారుతీ ఆల్టో 800(Maruti alto 800) కారు ఉంది. ఈ కారు అద్దాలను మాత్రం వదిలేసి కారు మొత్తం ఆవు పేడను(cow dung) సున్నం పూత వేసినట్టు వేశాడు. ఇది చూసినవారు 'ఈయనకేమైనా పిచ్చా? ఇలా చేస్తున్నాడు' అని అనుకున్నారు. కొందరు ఆయన దగ్గరకు వెళ్లి 'ఎందుకు ఇలా ఆవు పేడ పూశారు?' అని అడిగారు. అప్పుడు ఆయన చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'ఆవుపేడ వేడిని గ్రహించదు. ఇప్పుడున్న ఎండల ధాటికి వాహనాల క్యాబిన్ చాలా తొందరగా హీటెక్కుతుంది. దీనివల్ల కారు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బందే అవుతుంది. ఆవు పేడను కారుకు పూయడం వల్ల ప్రభావవంతమైన సూర్యకాంతిని(cow dung control sun heat) అడ్డుకుంటుంది. ఎండ నుండి కారు వేడెక్కకుండా చేస్తుంది' అని చెప్పుకొచ్చారు.

Viral Video: ఇదేం పోయేకాలం నాయనా..? జుర్రుకుని మరీ తినాల్సిన మామిడి పండుతో ఇలాంటి నిర్వాకాలేంటి..? నెటిజన్ల ఫైర్..!


కేవలం కారుకే కాదు.. ఏసీ అలర్జీ ఉన్నవారు కూడా ఈ టెక్నిక్ ఉపయోగించుకోవచ్చని ఈయన తెలిపాడు. అంతేకాదు ఇలా కారుకు ఆవుపేడ పూయడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు ఓమ్నీ వ్యాన్ కు ఆవుపేడను ఇలానే పూశానని ఆయన చెప్పారు. ఇలా ఆవుపేడ పూయడం వల్ల ఎండల ధాటికి కారుకు నష్టం జరగకుండా ఉండటమే కాకుండా ప్రయాణికులకు వేడి వల్ల అసౌకర్యం ఏర్పడే పరిస్థితి తప్పుతుందని చెప్పారు. ఈ విషయం విన్న నెటిజన్లు పేడ వాసనతో ఎంత దూరం ప్రయాణించాలో ఏంటో అని కళ్లు తేలేస్తున్నారు.

Viral Video: నిజమైన వైద్యుడివి అంటే నువ్వేనయ్యా.. ఓ శునకం ఆహారం తినడం మానేసిందని ఈ డాక్టర్ ఏం చేశాడో మీరే చూడండి..!


Updated Date - 2023-04-26T19:50:32+05:30 IST