Viral Video: నిజమైన వైద్యుడివి అంటే నువ్వేనయ్యా.. ఓ శునకం ఆహారం తినడం మానేసిందని ఈ డాక్టర్ ఏం చేశాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-04-26T17:46:37+05:30 IST

వైద్యానికి వచ్చిన ఓ కుక్క ఆహారం తినడం లేదనే కారణంతో ఆయన చేసిన పని చూస్తే గుండె బరువెక్కుతుంది..

Viral Video: నిజమైన వైద్యుడివి అంటే నువ్వేనయ్యా.. ఓ శునకం ఆహారం తినడం మానేసిందని ఈ డాక్టర్ ఏం చేశాడో మీరే చూడండి..!

దేవుడు ప్రాణులను సృష్టిస్తే వైద్యులు తమ వైద్యంతో ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యులను(doctors are gods) ప్రత్యక్ష దేవుళ్లు అని అంటారు. రోగులకు భయం పోగొట్టి భరోసా ఇవ్వగలిగితే ఎలాంటి సమస్య అయినా తగ్గిపోతుందనేది వైద్యుల నమ్మకం. కొన్ని సందర్భాలలో వైద్యులు తమ పెద్ద మనసు చాటుకుంటూ ఉంటారు. ఓ వెటర్నరీ డాక్టర్ కూడా ఇప్పుడు తన పెద్ద మనసు చాటుకున్నాడు. అతని దగ్గర వైద్యానికి వచ్చిన ఓ కుక్క ఆహారం తినడం లేదనే కారణంతో ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నిజమైన వైద్యుడివి నువ్వేనయ్యా నీలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు' అని ఆయనపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జంతు హింస(animal abuse) చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. వీధి కుక్కలను(street dogs), పెంపుడు కుక్కలను(pet dogs) ఇష్టానుసారం కొట్టేవారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల చేతుల్లో ఆ మూగజీవులు చాలా నరకం అనుభవిస్తాయి. ఓ కుక్క కూడా అదే విధంగా నరకం అనుభవించింది. దాంతో అది చాలా భయపడిపోయింది.ఎంతగా అంటే మనుషుల్ని చూస్తే చాలు అది భయంతో ఒణికిపోతోంది, తిండి నీళ్లు కూడా మానేసింది. ఆ కుక్కను ఓ వెటర్నరీ డాక్టర్(veterinary doctor) దగ్గరకు తీసుకెళ్ళారు. కుక్క పారిపోకుండా దాన్ని బోన్(cage) లో ఉంచారు. దానికి ఆహారం, నీరు బోన్ లో ఉంచితే అది తినలేదు. భయం భయంగా ఆ బోన్ లో ఒకమూలన కూర్చుంది. ఇది గమనించిన వెటర్నిటీ వైద్యుడు మొదట కుక్కలో భయాన్ని తగ్గించి అది ఆహారం తినేలా చేయాలని అనుకున్నాడు. ఆ కుక్క ఉన్న బోన్ లోకి ఆయన ప్రవేశించి కుక్క పక్కన కూర్చున్నాడు.మొదట కుక్కకు ఆహారం పెట్టాడు. కానీ అది తినలేదు(dog refuse to eat food). దీంతో కుక్కకు ఎలాంటి పాత్రలో ఆహారం పెట్టాడో అలాంటి పాత్రలోనే అతనూ ఆహారం తెచ్చుకున్నాడు. అతను కొద్దిగా తిని, మరొక చేత్తో కుక్క పాత్ర నుండి కొద్దిగా ఆహారం తీసి దాని నోటికి అందించాడు. ఆ కుక్క మొదట తినడానికి ఇష్టపడకపోయినా ఆ తరువాత తినింది. అతను చేత్తో అందించినది తినేశాక దాని పాత్రను కుక్క ముందుగా జరిపాడు. 'నాకిక్కడ ఎలాంటి భయం ఉండదు' అని కుక్క బలంగా నమ్మిందేమో ఆ డాక్టర్ పక్కనే నిశ్చింతగా దాని ఆహారం తినింది. కుక్క ఆహారం తింటున్నంతసేపు ఆ వెటర్నిటీ డాక్టర్ కుక్క పక్కనే కూర్చుని అతనూ ఆహారం తిన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bride Video: ఇలాంటి సీన్‌‌ను ఏ పెళ్లిలోనూ చూసి ఉండరు.. ఏడుస్తూ ఉన్న వధువును ఇలా ఎందుకు ఎత్తుకుని వస్తున్నారో తెలిస్తే..


Good News Dog అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల హృదయాలు బరువెక్కుతున్నాయి. 'ఎంత మంచి మనసు డాక్టర్ మీది' అని డాక్టర్ ను ప్రసంశిస్తున్నారు. 'ఈయన నిజంగా దేవుడే.. ఇలాంటి వైద్యులు ప్రతి చోటా ఉండాలి' అని మరికొందరు అన్నారు. 'ఈ వీడియో చూస్తోంటే ఎంత సంతోషంగా ఉందో' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఇదేం పోయేకాలం నాయనా..? జుర్రుకుని మరీ తినాల్సిన మామిడి పండుతో ఇలాంటి నిర్వాకాలేంటి..? నెటిజన్ల ఫైర్..!


Updated Date - 2023-04-26T17:46:37+05:30 IST