బొలేరో వాహనానికి ఎదురుగా వెళ్లిన ఏనుగు.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-01-14T20:19:08+05:30 IST

ఏనుగులు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు అంతా ఆశ్యర్యపడేలా డ్యాన్సులు వేస్తాయి.. మరికొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అతి భయానకంగా ప్రవర్తిస్తుంటాయి. దీంతో..

బొలేరో వాహనానికి ఎదురుగా వెళ్లిన ఏనుగు.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ఏం చేసిందంటే..

ఏనుగులు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు అంతా ఆశ్యర్యపడేలా డ్యాన్సులు వేస్తాయి.. మరికొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అతి భయానకంగా ప్రవర్తిస్తుంటాయి. దీంతో చాలా మంది వాటి దగ్గరకు వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

elephant-viral-video.jpg

సోషల్ మీడియాలో ఏనుగు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) వైరల్‌గా మారాయి. రోడ్డు మీదికి వచ్చిన ఓ ఏనుగు (elephant) ఎవరూ ఊహించని విధంగా బీభత్సం సృష్టించింది. రోడ్డు పైకి వచ్చిన ఏనుగు.. బొలేరో వాహనానికి (Bolero vehicle) ఎదురుగా వెళ్లింది. దీంతో డ్రైవర్ భయపడి అక్కడే నిలుపుకొన్నాడు. అయినా శాంతించని ఏనుగు వాహనాన్ని తన తొండంతో ఒక్కసారిగా ఎత్తిపడేసింది. ఒక పల్టీ కొట్టిన వాహనాన్ని వదిలేయకుండా మళ్లీ తొండంతో ఎత్తేస్తుంది. దీంతో రెండు పల్టీలు కొట్టిన వాహనం కొంచెం దూరంగా పడుతుంది. అప్పటికి శాంతించిన ఏనుగు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

భార్య దూరంగా ఉండడంతో.. మరో ఇంటి తలుపు తట్టిన వ్యక్తి.. బయటికి వచ్చిన ఆమె ముందే..

Updated Date - 2023-01-14T20:19:14+05:30 IST