Viral Video: పెళ్లి ఊరేగింపులో వధువుతో కలిసి రొమాంటిక్‌ స్టంట్ చేయాలని చూసిన వరుడు.. పాపం చివరికి..

ABN , First Publish Date - 2023-01-03T15:42:40+05:30 IST

చిత్రవిచిత్రమైన పనులు చేసి.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు అప్పుడప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లలోనూ వధూవరులు.. వివిధ విన్యాసాలు చేయడం చూస్తున్నాం. వివాహ కార్యక్రమాల్లో..

Viral Video: పెళ్లి ఊరేగింపులో వధువుతో కలిసి రొమాంటిక్‌ స్టంట్ చేయాలని చూసిన వరుడు.. పాపం చివరికి..

చిత్రవిచిత్రమైన పనులు చేసి.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు అప్పుడప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లలోనూ వధూవరులు.. వివిధ విన్యాసాలు చేయడం చూస్తున్నాం. వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే ఘటనలు.. కొన్నిసార్లు తెగ వైరల్ అవుంతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. పెళ్లి ఊరేగింపులో వరుడు రొమాంటిక్ స్టంట్ చేయాలని చూస్తాడు. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకుల్లో పాల్గొన్న యువతి.. రాత్రి అంతా నిద్రపోయాక సడన్‌గా ఆమె చేసిన పని..

సోషల్ మీడియాలో ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (Wedding viral videos) అవుతోంది. వివాహ ఊరేగింపులో వధూవరులు ఇద్దరూ వేదికపై నిలబడి ఉంటారు. బంధువులంతా కింద నిలబడి ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకుంటూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొందరు తమ ఫోన్లు పట్టుకుని, వధువును పైకి ఎత్తుకోమంటూ వరుడికి సూచించారు. స్నేహితులు పదే పదే ఒత్తిడి తేవడంతో చివరకు వధువును పైకి ఎత్తేందుకు పూనుకొంటాడు. దీంతో వధువు సిగ్గుతో తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అయితే వధువును పైకి ఎత్తే క్రమంలో ఆమె బరువును బ్యాలెన్స్ చేయలేక.. చివరకు ధబేల్‌మని కిందపడతాడు. తాను పడడమే కాకుండా వధువును కూడా కింప పడేస్తాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్నవారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

Updated Date - 2023-01-03T15:43:08+05:30 IST