fatty liver: ఆల్కహాల్ తీసుకున్న తీసుకోకపోయినా..లివర్ దెబ్బతింటుంది..ముఖ్యంగా వారు జాగ్రత్తగా ఉండాలి..!

ABN , First Publish Date - 2023-03-08T11:12:51+05:30 IST

కాలేయంలో(liver) కొన్ని రకాల మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అతి బరువు ఉండే ఊబకాయంలో(obesity) ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రుగ్మత సోకిన వారిలో...

fatty liver: ఆల్కహాల్ తీసుకున్న తీసుకోకపోయినా..లివర్ దెబ్బతింటుంది..ముఖ్యంగా వారు జాగ్రత్తగా ఉండాలి..!

కాలేయంలో(liver) కొన్ని రకాల మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అతి బరువు ఉండే ఊబకాయంలో(obesity) ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రుగ్మత సోకిన వారిలో కాలేయంలో కొవ్వు అధికంగా పెరుకుపోతుంది. అయితే తొలి దశలో దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ వ్యాధి ముదిరే కొద్దీ పరిస్థితులు తీవ్రమవుతాయి. ఒక్కొసారి కాలేయం పూర్తిగా దెబ్బతినవచ్చు..లేదా లివర్ సిరోస్(liver cirrhosis) లాంటి ముప్పు కూడా ఉంటుంది. ఈ పరిస్థితికి ఆల్కాహాల్(Alcohol) కారణం కానప్పటికీ ఇదీ వచ్చాక ఆల్కహాల్ తీసుకుంటే వ్యాధి మరింత ముదిరిపోతుంది. అందుకే ఫ్యాటీ లివర్ (Fatty liver) రుగ్మత ఉండేవారు. మద్యపానం(Alcohol), సిగరెట్లను(cigarettes) పూర్తిగా పక్కనపెట్టాలి. యూకే హెల్త్ లివర్ సెంటర్(UK Health Liver Centre) ప్రకారం..కొవ్వులేకపోవడం.. లేదా..స్వల్ప మొత్తంలో కొవ్వు(fat) ఉండే లివర్‎ను ఆరోగ్యకర కాలేయంగా చెబుతారు.

అయితే..ఇక్కడ కణాల్లో నిల్వ ఉండే ఫ్యాట్.. 5 శాతం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు కాలేయ రుగ్మతగా పరిగణిస్తారు. దీన్ని మొదట్లోనే అదుపు చేయలేకపోతే..దీన్ని ఫ్యాటి లివర్‎గా మారిపోతుంది. బ్రిటన్‎లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్ ఆల్కహాలిక్, ఫ్యాటీ లివర్‎తో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా(Worldwide) చూస్తే ఫ్యాటీ లివర్ తో బాధపడే వారి సంఖ్య 65 కోట్లకుపైనే ఉంది. ఇది మొత్తం జనాభాలో 8.8శాతం వరకు ఉంటుంది. మరోవైపు రోజు రోజుకు సంఖ్య పెరిగిపోతుంది. బ్రిటన్‎లోని నేషనల్ హెల్త్ సర్వీసు(National Health Service) ప్రకారం..లివర్ విపరీతంగా పెరిగే కొవ్వుతో మధుమెహం, రక్తపోటు, కిడ్నివాధ్యులు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమెహంతో బాధపడేవారికి ఫ్యాటీ లివర్ వస్తే..గుండెపోటు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.

అసలు తమ శరీరంలో ఫ్యాటీ లివర్..మొదలైందని చాలా మందికి తెలియదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు రాకుండా ముందే మనము అడ్డుకోవచ్చు. ఊబకాయలు, అధికబరువు ఉండేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం లేదా ముప్పు ఎక్కువగా ఉంటాయి. మధుమెహం, అధికరక్త పోటు, అధిక కొలస్ట్రాల్ స్థాయిలు జీవక్రియరేటు సమస్యలు ఉన్నా ఈ వ్యాధి రావొచ్చు. పొగత్రాగడం కూడా ముప్పు తెచ్చిపెడుతుంది. నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసిస్(Non-alcoholic fatty liver disease) తొలి దశలో పెద్దగా కనిపించదు. అందుకే ఎప్పటికప్పుడు మనం వైద్య పరీక్షలు(Medical tests) చేయించుకోవాలి.

Updated Date - 2023-03-08T11:12:51+05:30 IST