Share News

Johnson's Baby Powder: టేస్ట్ బాగుంటుందట.. జాన్సన్ బేబీ పౌడర్‌ను తెగ తినేస్తున్న మహిళ..!

ABN , First Publish Date - 2023-12-08T12:35:00+05:30 IST

US Woman: ప్రపంచవ్యాప్తంగా ఉండే కొందరికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. అలాంటి వింత అలవాటు కలిగిన ఓ మహిళ తాలూకు వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో ఉండే ఆ మహిళ డైలీ ఒక డబ్బా జాన్సన్ బేబీ పౌడర్‌ (Johnson's Baby Powder) ను తినేస్తుంది.

Johnson's Baby Powder: టేస్ట్ బాగుంటుందట.. జాన్సన్ బేబీ పౌడర్‌ను తెగ తినేస్తున్న మహిళ..!

US Woman: ప్రపంచవ్యాప్తంగా ఉండే కొందరికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. అలాంటి వింత అలవాటు కలిగిన ఓ మహిళ తాలూకు వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో ఉండే ఆ మహిళ డైలీ ఒక డబ్బా జాన్సన్ బేబీ పౌడర్‌ (Johnson's Baby Powder) ను తినేస్తుంది. అదేంటని అడిగితే దాన్ని రుచి తనకు తెగ నచ్చిందని, అందుకే అలా ప్రతిరోజూ ఒక డబ్బా లేపేస్తున్నట్లు చెబుతోంది. దీనికోసం ఆమె ఏటా ఏకంగా రూ.3లక్షలపైనే ఖర్చు చేస్తుండడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Viral: 148 దేశాలను చూపిస్తామని రూ.26 లక్షలను తీసుకుని.. చివరకు ఆ మహిళను రోడ్డున పడేశారు..!

వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌లోని లూసియానాలో నివాసం ఉండే డ్రెకా మార్టిన్ (Dreka Martin) అనే 27ఏళ్ల మహిళకే ఈ వింత అలవాటు ఉంది. ఆ పౌడర్ డబ్బాను చూస్తే చాలు ఆమె నోట్లో నీళ్లు తిరుగుతాయట. తన రోజువారీ ఫుడ్ మెనులో ఏదో ఒక పూట తప్పనిసరిగా జాన్సన్ బేబీ పౌడర్ ఉండాల్సిందేనని మార్టిన్ చెబుతోంది. ఇలా తినడం తనకు అలవాటుగా మారిపోయిందని, ఏదైనా ఒకరోజు తినకుంటే ఏదో వెలితిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇలా ఎందుకని అడిగితే.. "బేబీ పౌడర్ తినడం నాకు చాలా ఇష్టం. పౌడర్ రుచి దాని సువాసనలానే చాలా బాగా ఉంటది. ఆ సువాసనే నన్ను పౌడర్‌ను తినేలా టెంప్ట్ చేస్తుంది. అలా తినడం నన్ను ఆనందాన్ని ఇస్తుంది" అని చెప్పుకొచ్చింది. మొదట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డానని చెప్పిన ఆమె.. ఆ తర్వాత తరచూ అదే పనిచేయడంతో ఇంట్లోవారికి తెలిసిపోయినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Viral News: రెండు దోశలు, ప్లేట్ ఇడ్లికి రూ.1000 బిల్.. అదేంటని అడిగిన కస్టమర్‌కు రెస్టారెంట్ షాకింగ్ రిప్లై!

ఇక మార్టిన్ అలవాటు గురించి తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆమెను మానుకోవాలని వారించారు. అటు జాన్సన్ కంపెనీ కూడా ఇది తినడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఆమె వినిపించుకోవడం లేదు. అయితే, తన ప్రగ్నెన్సీ సమయంలో మాత్రమే తాను కొన్నిరోజులు ఆ పౌడర్‌ను తినలేదని చెప్పింది. అయితే, తనకు ఉన్న ఈ అలవాటు కారణంగా ఏటా రూ.3 లక్షల పైనే ఖర్చు అవుతుందని తెలిపింది. చాలాకాలంగా ఇలా బేబీ పౌడర్ తింటునప్పటికీ తనకు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని మార్టిన్ చెప్పింది. కాగా, ఆమెకు ఉన్న ఈ అలవాటు వెనుక ఒక అనారోగ్య సమస్య ఉందని వైద్యులు తేల్చారు. ఆమె 'పికా' అనే డిసార్డర్ కారణంగా ఇలా జాన్సన్ బేబీ పౌడర్ తినడం చేస్తుందని చెప్పారు. ఈ డిసార్డర్ ఉన్న వ్యక్తులకు ఆహారేతర పదర్థాలైన చాక్‌పీస్, పెయింట్ లాంటివి తినాలనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-12-08T12:47:35+05:30 IST