Money: సినిమాలో చూపించింది మక్కీకి మక్కీ అమలు చేశారు.. 47 లక్షల రూపాయలను కొల్లగొట్టేశారు.. కానీ ఒక్క క్లూ‌తో..

ABN , First Publish Date - 2023-03-31T15:03:23+05:30 IST

ఆ ముగ్గురు మాత్రం ఓ సినిమాలోని దోపిడీ సీన్‌ చూసి మరీ.. మక్కీకి మక్కీగా అమలు చేసి చోరీకి పాల్పడ్డారు. ఎక్కడో.. ఏంటో తెలియాలంటే

Money: సినిమాలో చూపించింది మక్కీకి మక్కీ అమలు చేశారు.. 47 లక్షల రూపాయలను కొల్లగొట్టేశారు.. కానీ ఒక్క క్లూ‌తో..
Money

చాలా మంది సినిమాలు చూసి ప్రేరణ పొందుతుంటారు. హీరో స్టైల్‌నో. లేకుంటే హీరోయిన్ స్టైల్‌నో ఫాలవుతుంటారు. ఇంకొంతమంది అందులో ఉన్న మంచిని తీసుకుని చెడును విడిచిపెడుతుంటారు. మరికొందరు సినిమాను ఓ ఎంటర్టైన్‌మెంట్‌గా చూసి వదిలిపెట్టేస్తుంటారు. ఇలా రకరకాలైన అభిరుచులు కలిగిన మనుషులంటారు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఓ సినిమాలోని దోపిడీ సీన్‌ చూసి మరీ.. మక్కీకి మక్కీగా అమలు చేసి చోరీకి పాల్పడ్డారు. ఎక్కడో.. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఓ సినిమాలోని దోపిడీ సన్నివేశాన్ని ఆ ముగ్గురూ వంటపట్టించుకున్నారు. అంతే అచ్చం అదే స్టైల్‌లో దోపిడీ (theft)కి పాల్పడ్డారు. ఏకంగా రూ.47 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని పుణె (Pune)లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Sleeping: గాఢ నిద్రలో ఉండగా ఎవరైనా మీద కూర్చున్నట్టు అనిపించిందా..? నోట మాట రాలేని పరిస్థితి ఏర్పడిందా..?

నానాపేట్‌కు చెందిన గోస్వామి మార్కెటింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన డబ్బు(Money)ను బ్యాంకులో వేయడం అతని డ్యూటీ. దీన్ని గమనించిన కొందరు దుండగులు.. అతడి నుంచి నగదు కాజేసేందుకు స్కెచ్ వేశారు. అనుకున్న తడువుగా ఓ రోజు ప్రణాళికను అమలు చేశారు. రోజూలాగే ఉదయాన్నే గోస్వామి డబ్బులు తీసుకుని బ్యాంకుకు బయల్దేరాడు. ఆజాద్‌ చౌక్‌ దగ్గరకు వచ్చేటప్పటికీ ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. కత్తిని చూపించి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో అతని దగ్గర ఉన్న రూ.47 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. వెనువెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..!

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. ఇలా దాదాపుగా 500 సీసీ కెమెరాలు పరిశీలిస్తే... అనుమానాస్పదంగా కనిపించిన ఓ ఆటోను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రుషికేశ్ గైక్వాడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నానాపేట్‌కు చెందిన రుషికేశ్ గైక్వాడ్, కిరణ్, ఆకాష్‌లు ఈ దోపిడీకి పాల్పడినట్లుగా నిర్ధారించారు. గైక్వాడ్ గతంలో మార్కెటింగ్ ఏజెన్సీలో సేల్స్‌మెన్‌గా పని చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. గైక్వాడ్‌పై ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. గోస్వామి.. ప్రతిరోజూ డబ్బులు తీసుకెళ్లడాన్ని గమనించిన గైక్వాడ్.. అతని దగ్గర నుంచి నగదు కాజేయాలని పథకం రచించాడు. అంతే ఓ సినిమాలోని సీన్ చూసి ఇన్‌స్పిరేషన్ పొందిన గైక్వాడ్.. తన స్నేహితులతో కలిసి అదే పద్ధతిలో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం నిందితుల దగ్గర నుంచి రూ.25 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Cooler: వాడకుండా పక్కన పడేసిన పాత కూలర్‌ను మళ్లీ బయటకు తీస్తున్నారా..? వాడే ముందు చేయాల్సిన పనులివీ..!

ddde.jpg

Updated Date - 2023-03-31T15:03:23+05:30 IST