Share News

Indian Railway: రైల్లో అందరి ముందే ఓ యువతి బోల్డ్ డ్యాన్స్‌.. రైలు టికెట్ల ధరలు ఇందుకే పెంచుతున్నారా అంటూ..!

ABN , First Publish Date - 2023-11-29T12:22:22+05:30 IST

Viral Video: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతిరోజు భారీ సంఖ్యలోనే వీడియోలు వైరల్ కావడం కామన్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే కొందరు వ్యూస్, లైక్స్ కోసం అతిగా ప్రవర్తించడం చేస్తున్నారు.

Indian Railway: రైల్లో అందరి ముందే ఓ యువతి బోల్డ్ డ్యాన్స్‌.. రైలు టికెట్ల ధరలు ఇందుకే పెంచుతున్నారా అంటూ..!

Viral Video: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతిరోజు భారీ సంఖ్యలోనే వీడియోలు వైరల్ కావడం కామన్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే కొందరు వ్యూస్, లైక్స్ కోసం అతిగా ప్రవర్తించడం చేస్తున్నారు. వాటి తాలూకు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (Social Media) అప్‌లోడ్ చేయడం, అవి కాస్తా వైరల్ కావడం జరుగుతోంది. ఇదే కోవలో తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. ఆ యువతి రైల్లో అందరి ముందే బోల్డ్ డ్యాన్స్‌ చేయడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అతి కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు.. రైలు టికెట్ల ధరలు ఇందుకే పెంచుతున్నారంటూ..! యువతికి చురకలు అంటిస్తున్నారు.

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. యువతి రైలు బెర్త్‌పై బోల్డ్‌గా డ్యాన్స్ చేయడం ఉంది. ట్రైన్‌లోని మిగతా ప్రయాణికులు ఆమెను చూస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా యువతి చిందులేసింది. ఆమెతో పాటు ప్రయాణించిన హేమెంద్ర త్రిపాఠి అనే వ్యక్తి ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశారు. 'రైలులో ఇలాంటి వేశాలేంటో అర్థం కావడం లేదని, ఇందుకే రైలు టికెట్ల ధరలు పెంచుతున్నారు' అనే లైన్‌ను ఈ వీడియోకు జత చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి వాటిని ఉపేక్షించరాదని, ట్యాక్స్ వేయాలని ఒకరు అంటే.. పిల్లలు, పెద్దలు కలిసి ప్రయాణించే రైళ్లలో ఇలాంటి చర్యలు క్షమించరానివి అని మరోకరు అన్నారు. ఇదిలాఉంటే.. ఇటీవల ఈ కోవకు చెందిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రోతో పాటు ఇతర రైళ్లలో కొందరు యువత ఇలాంటి బరితెగింపు పనులకు పాల్పడుతున్నారు.

Viral News: వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించిన పాక్ పెద్దాయన.. 65ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

Updated Date - 2023-11-29T12:22:23+05:30 IST