Share News

Viral Video: బైక్‌కు తగిలించిన హెల్మెట్‌లోంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే బుసకొట్టిన నాగుపాము.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-29T13:51:34+05:30 IST

Viral Video: సామాజిక మాధ్యమాల్లో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేసేవి ఉంటే.. మరికొన్ని విజ్ఞానాన్ని పంచేవి.. ఇంకొన్ని ఆశ్చర్యం కలిగించేవి.. ఇంకా కొన్ని చూడగానే వామ్మో! అని నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి.

Viral Video: బైక్‌కు తగిలించిన హెల్మెట్‌లోంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే బుసకొట్టిన నాగుపాము.. చివరకు..!

Viral Video: సామాజిక మాధ్యమాల్లో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేసేవి ఉంటే.. మరికొన్ని విజ్ఞానాన్ని పంచేవి.. ఇంకొన్ని ఆశ్చర్యం కలిగించేవి.. ఇంకా కొన్ని చూడగానే వామ్మో! అని నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. వీడియోలో ఒక పాము బూసలు కొట్టడం మనం చూడొచ్చు. అబ్బో.. ఇప్పటివరకు ఎన్ని పాము వీడియోలు చూడలేదు అని తెలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ వీడియోలోని పాము దాగి ఉన్న చోటు గురించి తెలిస్తే షాక్ అవుతారు.

Indian Railway: రైల్లో అందరి ముందే ఓ యువతి బోల్డ్ డ్యాన్స్‌.. రైలు టికెట్ల ధరలు ఇందుకే పెంచుతున్నారా అంటూ..!


ఇంతకీ పాము ఎక్కడ దాక్కుందో తెలుసా? బండి హెల్మెట్‌లో. అవును మీరు విన్నది నిజమే. బైక్‌కు తగిలించిన హెల్మెట్‌లోంచి వింత శబ్దాలు రావడం గమనించిన వాహనం యజమాని.. ఏంటా అని చూస్తే లోపలి నుంచి నాగుపాము బుసకొట్టింది. అది చూసిన ఆ వ్యక్తి షాకయ్యాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, ఈ వీడియోను డీ శ్రేష్టా (d_shrestha10) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనికి 'ఓఏంజీ' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను ఇప్పటివరకు మిలియన్ మంది చూడగా.. 43వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'పాము అచ్చం హెల్మెట్ కలర్‌లోనే ఉందని' ఒకరు కామెంట్ చేస్తే, 'ఏదైనా జరగరానిది జరిగి ఉంటే.. వాహనదారుడు ప్రాణాలు కోల్పోయేవాడు' అని మరోకరు కామెంట్ చేశారు. అందుకే బండి తీస్తున్న సమయంలో.. నెత్తికి హెల్మెట్‌ పెట్టుకునేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్.

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!

Updated Date - 2023-11-29T13:51:35+05:30 IST