Petrol Bunk: పక్కా స్కెచ్‌తో పెట్రోల్ బంక్‌లో చోరీకి వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లకు షాకింగ్ ట్విస్ట్.. ఈజీగా డబ్బు కొట్టేశారు కానీ.. వెనక్కు తిరిగి చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-02T12:06:58+05:30 IST

పక్కా స్కెచ్‌తో పెట్రోల్ బంక్‌లో చోరీకి వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

Petrol Bunk: పక్కా స్కెచ్‌తో పెట్రోల్ బంక్‌లో చోరీకి వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లకు షాకింగ్ ట్విస్ట్.. ఈజీగా డబ్బు కొట్టేశారు కానీ.. వెనక్కు తిరిగి చూస్తే..!

Viral Video: పక్కా స్కెచ్‌తో పెట్రోల్ బంక్‌లో చోరీకి వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ ఇద్దరు బైక్‌పై (Bike) పెట్రోల్ బంక్‌కు వెళ్లడం.. అక్కడ క్యాషియర్‌ (Cashier) నుంచి బలవంతంగా నగదు లాక్కొని ఊడాయించేందుకు ప్రయత్నించడం.. అంతలో అదే బంకులో ఉన్న ఓ కస్టమర్ ఊహించనివిధంగా స్పందించడంతో ఆ ఇద్దరు దొంగలలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం.. ఇలా అంతా కూడా సినిమాటిక్‌గా జరిగిపోయింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది తెలియనప్పటికీ దీని తాలూకు వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఇద్దరు కుర్రాళ్లు పక్కా స్కెచ్‌తో పెట్రోల్ బంక్‌లో (Petrol Bunk) చోరీకి వెళ్లారు. అక్కడ క్యాషియర్ దగ్గరి నుంచి ఈజీగా నగదు లాక్కొని ఊడాయించే ప్రయత్నంలో ఉండగా.. అక్కడే ఉన్న ఓ కస్టమర్ వారిపై విరుచుకుపడ్డాడు. వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీ తీసి వారిపై కాల్పులు జరిపాడు. దాంతో బైక్ వెనకవైపు కూర్చున్న రెండో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక బైక్ డ్రైవ్ చేస్తున్న మొదటి వ్యక్తిపై కాల్పులు జరిపినప్పటికి అతడు తప్పించుకుని అక్కడి నుంచి ఊడాయించడం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో (Twitter) మే 31న పోస్ట్ అయిన ఈ వీడియోను ఏకంగా 2.6 మిలియన్ల మంది వీక్షించారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-02T12:09:08+05:30 IST