Musical Road: వావ్.. ఇదేం అద్భుతం.. స్పీడ్‌గా కారు వెళ్తోంటే.. రోడ్డులోంచి సంగీతం వచ్చేస్తోంది..!

ABN , First Publish Date - 2023-07-26T15:38:30+05:30 IST

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీలోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం వస్తోంది.

Musical Road: వావ్.. ఇదేం అద్భుతం.. స్పీడ్‌గా కారు వెళ్తోంటే.. రోడ్డులోంచి సంగీతం వచ్చేస్తోంది..!

సాంకేతికత (Technology) అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీ (Hungary)లోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం (Music) వస్తోంది. ఈ అద్భుతం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. @historyinmemes అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Road plays music).

వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఓ కారు (Car) రోడ్డుపై వెళుతోంది. రోడ్డు పైన గీసిన తెల్ల గీతలపై కారు ఓ మోస్తరు వేగంతో వెళ్తున్నపుడు సంగీతంలా వినిపిస్తోంది. హైవేపై వేగ పరిమితి గంటకు 80 కి.మీ. రోడ్డుపై కారు ఆ వేగంతో వెళుతున్నప్పుడు రోడ్డు, టైర్ల మధ్య ఘర్షణ కారణంగా సంగీతం వెలువడుతోంది. అయితే వాహనాన్ని డ్రైవర్ వేగంగా లేదా నెమ్మదిగా డ్రైవ్ చేస్తే మాత్రం సంగీతం అసంపూర్ణంగా వినిపిస్తుంది. హంగేరీలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫెల్సోజ్సోల్కా నుంచి స్లోవేకియా రహదారిలో నిర్మించిన ఈ రోడ్డును రోడ్ 37 (Road 37) అని పిలుస్తారు.

Viral Video: మైదానంలో మ్యాచ్ కాదు.. ఈ వ్యక్తి ట్యాలెంట్ చూసి ప్రేక్షకులు ఫిదా.. 10 కప్‌లను తలపై పెట్టుకుని ఎలా ఎక్కుతున్నాడో చూడండి..

ఈ రహదారిపై నిర్దేశించిన వేగంలో వాహనం వెళితే ఎరిక్ ఎ స్జోలో అనే జానపద పాట వినబడుతుంది. హంగేరీలోని సోమోగి కౌంటీలో రెండేళ్ల క్రితం ఈ రహదారిని నిర్మించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు లక్షల మంది లైక్ చేశారు. ఇదో టెక్నాలజీ అద్భుతం అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Updated Date - 2023-07-26T15:38:30+05:30 IST