Share News

Jio New Year offer: న్యూ ఇయర్ సందర్భంగా జియో అదిరిపోయే ఆఫర్.. ఈ ప్లాన్ బెన్‌ఫిట్స్ ఏంటంటే..

ABN , Publish Date - Dec 26 , 2023 | 05:02 PM

కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరరం రాబోతోంది. ఈ సందర్భంగా అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ చూసినా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. అలాగే మరోవైపు టెలికాం కంపెనీలు కూడా తమ యూజర్లకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటాయి. ఇందులో...

Jio New Year offer: న్యూ ఇయర్ సందర్భంగా జియో అదిరిపోయే ఆఫర్.. ఈ ప్లాన్ బెన్‌ఫిట్స్ ఏంటంటే..

కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరరం రాబోతోంది. ఈ సందర్భంగా అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ చూసినా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. అలాగే మరోవైపు టెలికాం కంపెనీలు కూడా తమ యూజర్లకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం జియో కంపెనీ ‘‘హ్యాపీ న్యూ ఇయర్ 2024’’.. పేరుతో కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ బెన్‌ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

ప్రముఖ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో.. న్యూ ఇయర్ సందర్భంగా (Reliance Jio New Year Offer) ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. HAPPY NEWYEAR 2024 పేరుతో ఎక్స్‌ట్రా వ్యాలిడిటీని అందిస్తోంది. రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు, అలాగే 2.5 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్ తీసుకున్న వారికి 365 రోజులకు అదనంగా మరో 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటూ ఏడాది పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను కూడా చూడొచ్చు.

ఈ 7 జీవులకు.. మెమొరీ పవర్ ఎలా ఉంటుందంటే..

ఈ ప్లాన్‌లో మిగతా వాటిలో పెద్దగా మార్పులు ఏవీ లేకున్నా వ్యాలిడిటీ పెరిగడం వల్ల వినియోగదారునికి రోజుకు పడే ఖర్చు తగ్గుతుందన్నమాట. అదేవిధంగా 5జీ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ద్వారా లభించేది జియో సినిమా ప్లాన్ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. జియో సినిమా ప్రీమియం కావాలంటే రూ.1,499తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 14 వేర్వేరు ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్ సింగిల్ ప్లాన్ ద్వారా లభించనుంది. డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్న వారికి ఈ న్యూ ఇయర్ ప్లాన్ వర్తిస్తుంది. అయితే ఆ ఆఫర్ గడువు తేదీని మాత్రం కంపెనీ తెలియజేయలేదు.

Viral Video: గోడ మీద పులి.. చుట్టూ విచిత్రంగా చూస్తున్న జనం.. చివరకు ఏమైందంటే..

Updated Date - Dec 26 , 2023 | 05:02 PM