రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వినూత్న ప్రయోగం.. లారీ వెనుక ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

ABN , First Publish Date - 2023-01-13T18:20:18+05:30 IST

రోజూ నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిబంధనలు పాటించని డ్రైవర్ల కారణంగా కొన్నిసార్లు, మరికొన్ని సార్లు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల వల్ల ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. ఇంకొందరు డ్రైవర్లు ఎదురుగా వెళ్లే వాహనాలను నిర్లక్ష్యంగా..

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వినూత్న ప్రయోగం.. లారీ వెనుక  ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

రోజూ నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిబంధనలు పాటించని డ్రైవర్ల కారణంగా కొన్నిసార్లు, మరికొన్ని సార్లు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల వల్ల ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. ఇంకొందరు డ్రైవర్లు ఎదురుగా వెళ్లే వాహనాలను నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఎంత అవగాహన కల్పించినా.. ప్రమాదాలు మాత్రం తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లారీ డ్రైవర్.. ప్రమాదాల నివారణకు సరికొత్త ప్రయోగం చేశాడు. దీంతో ఈ లారీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్రేయసి గుర్తుగా వీడియోలు, ఫొటోలను దాచుకున్న ప్రియుడు.. అయితే చివరకు ప్రియురాలి తల్లి అలా అనడంతో..

lorry-video.jpg

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్ సమయంలో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ఓ వ్యక్తి లారీ (Lorry) వెనుక భాగంలో ఎల్ఈడీ (LED) ఏర్పాటు చేశాడు. దీంతో వెనుక వస్తున్న వాహనదారులకు లారీ ముందు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది. తద్వారా వెనుక వచ్చే వాహనదారులు వేగాన్ని నియంత్రించుకునేందుకు వీలు ఉంటుంది. కాగా, గతంలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారులు ఉన్న దేశాల్లో ఒకటైన అర్జెంటీనాలో శామ్‌సంగ్ 'సేఫ్టీ ట్రక్' (Samsung 'Safety Truck') పేరుతో ఓ ట్రక్కుకు ఇలాగే వెనుక భాగంలో డిస్‌ప్లే ఏర్పాటు చేసి, పైలట్ పరీక్ష నిర్వహించారు.

Viral Video: కారులో ఎక్కమంటే ప్రియున్ని ఖంగు తినిపించిన ప్రేయసి.. ట్రాలీ బ్యాగ్‍‌తో ఏం చేసిందో చూడండి..

అయితే ఈ విధానంపై కొన్ని సందేహాలు ఉండడంతో అందుబాటులోకి తీసుకురాలేదు. వెనుక వస్తున్న వారు.. ముందున్న డిస్‌ప్లే చూసే క్రమంలో మరిన్ని ప్రమాదాలకు (Accidents) కారణమవుతుందేమో అని సందేహాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఈ లారీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆలోచన బాగుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

Updated Date - 2023-01-13T18:20:41+05:30 IST