Share News

Parenting: పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పక చెయ్యాల్సిన 5 పనులివీ..!

ABN , First Publish Date - 2023-12-13T15:02:44+05:30 IST

తమ తల్లిదండ్రులను స్నేహితులుగా భావించే పిల్లలు తక్కువ. అలాంటి తల్లిదండ్రులు తప్పకుండా చెయ్యాల్సిన 5 పనులు ఇవీ..

Parenting: పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పక చెయ్యాల్సిన 5 పనులివీ..!

తల్లిదండ్రులుగా మారడం సులువే కానీ.. ఉత్తమ తల్లిదండ్రులుగా ఉండటం, పిల్లల పెంపకం అంత సులువేమీ కాదు. ఈ రోజుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. తల్లిదండ్రుల బిజీ ఉద్యోగాలు, సోషల్ మీడియా ప్రభావం, ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలైనవి పిల్లల పెంపకం మీద ప్రభావం చూపిస్తున్నాయి. వీటి కారణంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సాన్నిత్యం కూడా తక్కువగా ఉంటుంది. తమ తల్లిదండ్రులను స్నేహితులుగా భావించే పిల్లలు తక్కువగానే ఉంటున్నారు. అలాంటి తల్లిదండ్రులు తప్పకుండా చెయ్యాల్సిన 5 పనులు ఇవీ..

పిల్లలతో సమయాన్ని గడిపే విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడటం, వారితో చర్చించడం చేయాలి. ఇవి పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని బలపరుస్తాయి. పిల్లలు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లకు దూరంగా ఉంటారు. పిల్లలకు నిజమైన సంతోషం ఇలానే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Coconut Water vs Fruit Juice: కొబ్బరి నీళ్లు మంచివా..? జ్యూస్‌లు బెస్టా..? బరువు తగ్గేందుకు ఏది మంచిదంటే..!



పిల్లలతో సమయాన్ని చాలా సంతోషంగా గడపడానికి టూర్లు బాగా సహాయపడతాయి. ఈ సమయంలో పెద్దలు కూడా పిల్లల్లా మారిపోయి వారితో కలసిపోతారు. ఎక్కువ రోజులు వెళ్లలేకపోయినా సరే.. కనీసం ఒక్కరోజు ట్రిప్ అయినా ప్లాన్ చేసుకుంటే చాలు. కొద్ది సమయం అయినా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. పిల్లలకు మంచి జ్ఞాపకాలు పోగవుతాయి.

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా చెప్పగానే తొందరగా వారి నిర్ణయం చెప్పేస్తారు. పిల్లలు చెబుతున్న విషయాలను, వారి భావోద్వేగాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేసే వాతావరణం కల్పించాలి. ఇలా చేస్తే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాపరికంగా ఉంచరు.

కోపం, బాధ, నిరాశ వంటి ఎమోషన్స్ ను పెద్దలు హ్యాండిల్ చేస్తుంటారు. పిల్లలు కూడా కోపాన్ని, నిరాశను, బాధను బయటపెడుతున్నప్పుడు వారిని తల్లిదండ్రులు వారిస్తుంటారు. అలా బాధపడకూడదనో, నిరాశ పడకూడదనో చెబుతుంటారు. కానీ ఇది పిల్లలో భావోద్వేగ అభివృద్దికి ఆటంకం కలుగుతుంది. అందుకే పిల్లలు వారి భావోద్వేహాలను సహజంగా వ్యక్తీకరించడాన్ని అడ్డుకోకూడదు.

చిన్న మెప్పు పిల్లలలో కొండంత ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పిల్లలు పనులు విజయవంతంగా పూర్తీ చెయ్యడం, పరీక్షలలో మార్కులు బాగా తెచ్చుకోవడం, ఇంటిపనిలో సహాయపడటం వంటి విషయాలలో పిల్లలను మెచ్చుకుంటూ ఉండాలి. మెప్పు పిల్లలలో మరింత ఉత్సాహం నింపుతుంది. వైఫల్యాలు ఎదురైనా సరే.. పట్టుదలతో పనులు పూర్తీ చేస్తారు.

ఇది కూడా చదవండి: Health Tips: ఈ 9 టిప్స్ ఫాలో అయితే చాలు.. మానసిక సమస్యలన్నీ పరార్..!


Updated Date - 2023-12-13T15:02:50+05:30 IST