Share News

Coconut Water vs Fruit Juice: కొబ్బరి నీళ్లు మంచివా..? జ్యూస్‌లు బెస్టా..? బరువు తగ్గేందుకు ఏది మంచిదంటే..!

ABN , First Publish Date - 2023-12-13T11:49:09+05:30 IST

కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు రెండూ ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ రెండింటి గురించి షాకింగ్ నిజాలివీ..

Coconut Water vs Fruit Juice: కొబ్బరి నీళ్లు మంచివా..? జ్యూస్‌లు బెస్టా..? బరువు తగ్గేందుకు ఏది మంచిదంటే..!

కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరినీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ల కారణంగా సాధారణ వ్యక్తుల నుండి క్రీడాకారుల వరకు అందరికీ ఇది ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తుంది. పండ్లరసాల విషయానికి వస్తే ఇవి కూడా శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అందించడం నుండి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం వరకు ప్రయోజనాలు అందిస్తుంది.

కేలరీల విషయానికి వస్తే ఒక కప్పు కొబ్బరినీళ్లలో 46కేలరీలు ఉంటాయి. కానీ కేవలం పండ్ల నుండి రసం సేకరిస్తే ఒక గ్లాసు రసం తయారీకి ఎక్కువ పండ్లు వినియోగించాలి. లేదా తక్కువ పండ్లను వినియోగించి పండ్ల రసం రుచి పెరగడానికి పంచదార వినియోగిస్తారు. ఒక కప్పు పండ్ల రసంలో ఈజీగా 120 నుండి 200కేలరీలు ఉంటాయి. కేలరీల పరంగా కొబ్బరినీరు, పండ్లరసాలను కంపేర్ చేస్తే కొబ్బరినీళ్లలో కేలరీలు తక్కువ. అలాగని కొబ్బరినీళ్లను మరీ ఎక్కువగా తీసుకోకూడదు.

ఇది కూడా చదవండి: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు!


కేలరీల గురించి పక్కన పెడితే ఫైబర్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు ఆకలి నియంత్రించడంలో ఫైబర్ సహాయపడుతుంది. పండ్లరసాన్ని తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ కోల్పోతారు. కాబట్టి పండ్లరసాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెరలు వెళ్లడం తప్ప ప్రయోజనం ఉండదు. అదే కొబ్బరినీళ్లలో తక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది.

మార్కెట్లో లేదా బయట కొనే పండ్ల రసాలలో చాలావరకు పంచదారను జోడిస్తారు. కాబట్టి ఇవి బరువు తగ్గడం కంటే బరువు పెరగడానికి ఆస్కారం ఇస్తాయి. అదే కొబ్బరినీళ్లు తాజాగా కాయనుండి తీస్తారు కాబట్టి వీటిలో జోడించే చక్కెరలు ఏమీ ఉండవు. వీటిని తోసుకోవడం మంచిదే. అయితే కొబ్బరినీళ్లు కూడా మరీ మితిమీరి తీసుకోకూడదు.

కొబ్బరినీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కండరాల పనితీరుకు ఇవి చాలా ముఖ్యం. పండ్లరసంలో పండ్ల రకాన్ని బట్టి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ తీసుకునే ఆహారంలో కేలరీలను బట్టి కొబ్బరినీరు, పండ్ల రసాలను ఎంపిక చేసుకోవాలి. రెండింటిలో దేన్నీ విపరీతంగా తీసుకోకూడదు.

ఇది కూడా చదవండి: పచ్చి ఉల్లిపాయ తింటే 8 లాభాలు!

Updated Date - 2023-12-13T11:49:11+05:30 IST