ఈ సింపుల్ టిప్స్ తో ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు..

పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ ఎందుకు అవసరమనే విషయాన్ని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఇలా చేస్తే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదల పెరుగుతుంది.

ఇంగ్లీషుకు సంబంధించి ఎక్కడ ఏ సమాచారం కనిపించినా మొదట దాన్ని చదవడం మొదలెట్టాలి. ఇది ఇంగ్లీష్ త్వరగా  నేర్చుకోవడానికి మొదటి మెట్టు.

కొత్త పదాలు ఎక్కడ చూసినా, నేర్చుకున్నా వాటిని నోట్ చేసుకోవాలి.

స్నేహితులు, కొలీగ్స్.. ఇలా ఎవరితోనైనా ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించాలి.

ఇంగ్లీష్ పాడ్ క్యాస్ట్ లు, యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో అవుతూ అందులో విషయాలు వినాలి.

వార్తాపత్రికలు, బ్లాగ్ పోస్ట్ లు, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి.  ఇంగ్లీష్ పాటలు, ఇంటర్వ్యూలు వినాలి.

ఇంగ్లీష్ గురించి మనసులో ఏ సందేహం ఉన్నా దాన్ని అడిగి క్లియర్ చేసుకోవాలి.

ఆన్లైన్ కోర్సుల సహాయంతో కూడా ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవచ్చు.

మెసేజ్ లతో మొదలెట్టి మెల్లగా ఆర్టికల్స్ రాయడం దిశగా ప్రయత్నిస్తే ఇంగ్లీషులో ఉన్న పట్టు తెలిసిపోతుంది.