Share News

Optical Illusion: మీరు ఎలాంటి వారో ఈ ఒక్క ఫోటో చెప్పేస్తుంది.. కావాలంటే ఓ సారి ట్రై చేయండి..

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:06 PM

కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మనం ఒక చిత్రాన్ని చూసినప్పుడు దాని గురించిన మనం ఒక భావం అనుకుంటాం. కానీ నిజానికి అక్కడ నిజమైన చిత్రం మనం అనుకున్నదానికి భిన్నంగా ఉంటుంది. ఆ తరహా చిత్రాలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Optical Illusion: మీరు ఎలాంటి వారో ఈ ఒక్క ఫోటో చెప్పేస్తుంది.. కావాలంటే ఓ సారి ట్రై చేయండి..

కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మనం ఒక చిత్రాన్ని చూసినప్పుడు దాని గురించిన మనం ఒక భావం అనుకుంటాం. కానీ నిజానికి అక్కడ నిజమైన చిత్రం మనం అనుకున్నదానికి భిన్నంగా ఉంటుంది. ఆ తరహా చిత్రాలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోను మనం మొదట గుర్తించిన విధానాన్ని బట్టి మన మనస్తత్వాన్ని, భవిష్యత్‌ను కూడా చెబుతున్నారు. వీటినే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ తరహా చిత్రాలపై నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఫోటోను గుర్తించాక, చెప్పిన భావం వారి మనస్త్వానికి కాస్త దగ్గరగా ఉంటుండడం కూడా నెటిజన్లు వీటిపై ఆసక్తి చూపడానికి కారణం కావొచ్చు. తాజాగా అలాంటిదే మరో చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో నీలం, పసుపు రంగులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఒక వ్యక్తి వీధి లైట్ కింద నుంచొని ఉన్నాడు. కాస్త పరిశీలించి చూస్తే ఓ వ్యక్తి గోడపై వీధి లైట్ పెయింటింగ్ వేస్తున్నాడు. ఇందులో మీరు మొదట గుర్తించినదాని బట్టి మీ మనస్తత్వం ఏంటో చెబుతున్నారు.


Untitled-1.jpg

గోడపై పెయింటింగ్

మీరు గమనించిన మొదటి చిత్రం గోడపై పెయింటింగ్ వేస్తున్న వ్యక్తి అయితే.. మీరు సవాళ్లకు దూరంగా ఉండే వ్యక్తి కాదు. గొప్ప స్థితిస్థాపకత ఉన్న వ్యక్తి. జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు శ్రద్ధగా పని చేసి, మీ ఉత్తమ ప్రదర్శనను ఇస్తుంటారు. మీరు ఎప్పుడూ ముందు చూపును కల్గి ఉంటారు. ఎల్లప్పుడూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దానికోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆశయం మీ ముఖ్య లక్షణంగా ఉంటుంది. మీరు మీ భావోద్వేగాలను బహిరంగంగా వ్యకీకరించడం కష్టం. బలహీనంగా అనిపించినప్పుడు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సవాళ్లు మిమ్మల్ని భయపెట్టవు. మరింత కష్టపడేందుకు ప్రోత్సాహకంగా ఉంటాయి. మీరు ఇతరులను ఎక్కువగా సహాయం అడగలేరు.

వీధిలైట్ కింద మనిషి

మీరు గమనించిన మొదటి చిత్రం వీధి లైట్ కింద మనిషి ఉండడం అయితే పని చేసే సంస్థను మీరు అత్యంత విలువైనదిగా భావిస్తారు. ఇంటి వాతావరణం బాగుండడం మీకు ముఖ్యం. గందరగోళ పరిస్థితులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. పరిశుభ్రతపై మీరు దృష్టిసారిస్తారు. వ్యవస్థీకృత జీవితానికి చక్కటి నివాస స్థలం చాలా కీలమని మీరు దృఢంగా నమ్ముతారు. ఒక వ్యక్తిగా మీరు సమర్ధంగా, క్రమబద్దతను కలిగి ఉంటారు. మీకు ఇష్టమైన వారికి చేయూతనిచ్చేందుకు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటారు. ఇది సహాయ స్వభావ గుణాలను తెలియచేస్తుంది. మీ పరిపూర్ణత ధోరణులు, మీ విజయాలు మీపై మితిమీరిన విమర్శలకు దారి తీయొచ్చు. మీరు తరచుగా పనుల్లో నిమగ్నమై ఉండటానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని కేటాయించడాన్ని అంతగా ఇష్టపడరు. అయితే మీరు కఠినంగా ఉండడం ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడం, జీవితంలోని సాధారణ ఆనందాలను ఆస్వాదించడం కూడా ముఖ్యం.

Updated Date - Dec 26 , 2023 | 02:21 PM