Abby Choi: మోడల్ మర్డర్ మిస్టరీ వీడింది.. మాంసం కొట్టులోని ఫ్రీజ్‌లో కాళ్లు.. సూప్ బౌల్‌లో తల, పక్కటెముకలను గుర్తించిన పోలీసులు!

ABN , First Publish Date - 2023-03-01T13:58:35+05:30 IST

హంగ్‌కాంగ్‌కు (Hong Kong) చెందిన 28 ఏళ్ల మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్బీ చోయ్ (Abby Choi) దారుణ హత్యకు గురైంది.

Abby Choi: మోడల్ మర్డర్ మిస్టరీ వీడింది.. మాంసం కొట్టులోని ఫ్రీజ్‌లో కాళ్లు.. సూప్ బౌల్‌లో తల, పక్కటెముకలను గుర్తించిన పోలీసులు!

ఇంటర్నెట్ డెస్క్: హంగ్‌కాంగ్‌కు (Hong Kong) చెందిన 28 ఏళ్ల మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్బీ చోయ్ (Abby Choi) దారుణ హత్యకు గురైంది. ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా ఆమెను హతమార్చారు. ఆర్థిక లావాదేవిలా విషయంలో తలెత్తిన గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఆమె పుర్రెను పోలీసులు సూప్ తయారు ఓ పెద్ద పాత్రలో గుర్తించడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. ఈ నెల 21న అబ్బీ చోయ్ కనిపించకుండా పోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాద మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం గాలించారు.

ఈ క్రమంలో మూడు రోజుల తర్వాత ఆమె రెండు కాళ్లను ఓ మాంసం కొట్టులోని ఫ్రీజ్‌లో గుర్తించారు. అలాగే ఆమె పక్కటెముకలు, తలను ఓ సూప్ తయారు చేసే పెద్ద పాత్రలో (Soup Pot) కనుగొన్నారు. ఆమె పుర్రెపై చర్మం, మాంసం పూర్తిగా ఉడిపోయాయని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి అలన్ చుంగ్ వెల్లడించారు. పాత్ర నిండా రసం ఉందని, అందులో రబ్బీ చోయ్ పుర్రె, పక్కటెముకలు దొరికినట్లు ఆయన తెలిపారు. అలాగే సూప్‌లో మనం సాధారణంగా వేసే క్యారెట్, ముల్లంగి, ఇతర వెజిటెబుల్స్‌తో పాటు మాంసం ముక్కలు ఉన్నాయట.

ఇది కూడా చదవండి: భార్య వేధింపులకు తాళలేక విడాకులు.. భరణం కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త.. వీధుల్లో వింత బ్యానర్‌తో హల్‌చల్

ఇక డీఎన్ఏ టెస్టుల అనంతరం వాటిని రబ్బీ చోయ్ శరీర భాగాలేనని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతని సోదరుడు, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవలే రబ్బీ చోయ్ మొనాకో ఫ్యాషన్ మ్యాగ్జైన్ కవర్ పేజీపై కనిపించింది. అలాగే పారిస్ ఫ్యాషన్ వీక్‌కు కూడా క్రమం తప్పకుండా హాజరయ్యేవారట. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 1లక్ష కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చనిపోయిందని తెలియడంతో వారు సంతాపం తెలియజేస్తూ సందేశాలు పంపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

Updated Date - 2023-03-01T14:02:28+05:30 IST