Share News

Viral Video: ఇలాక్కూడా సిగరెట్ వెలిగించుకోవచ్చని ఇప్పుడే తెలిసింది.. అగ్గిపెట్టె లేదని ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2023-10-20T10:18:45+05:30 IST

పది మందిలో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా... ఇలాంటి వారంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ పైత్యాన్నంతా ఫొటోలు, వీడియోల రూపంలో చూపిస్తుంటారు. ఈ క్రమంలో...

Viral Video: ఇలాక్కూడా సిగరెట్ వెలిగించుకోవచ్చని ఇప్పుడే తెలిసింది.. అగ్గిపెట్టె లేదని ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవుతారు..

పది మందిలో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా... ఇలాంటి వారంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ పైత్యాన్నంతా ఫొటోలు, వీడియోల రూపంలో చూపిస్తుంటారు. ఈ క్రమంలో కొందరి చేష్టలు.. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగరెట్ వెలిగించుకోవడానికి రిస్కీ స్టంట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఇవేం పిచ్చి పనులురా.. నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బైకులో వెళ్తున్న ఓ వ్యక్తికి సిగరెట్ తాగాలనిపించింది. అయితే ఆ సమయంలో అతడి వద్ద అగ్గిపెట్టె కానీ, లైటర్ కానీ లేదు. అయినా ఎలాగైనా సిగరెట్ (Cigarette) తాగాలనే ఉద్దేశంతో అతను చివరకు వినూత్నంగా ఆలోచించాడు. బైకును ఆపి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేశాడు. అందులోని పెట్రోల్‌ను (petrol) వేలికి అంటించుకున్నాడు. తర్వాత ఆ వేలిని బైకు స్టార్ట్ చేసి, ఇంజిన్ (Bike engine) వద్ద ఉన్న వైరుకు స్పార్క్ వచ్చేలా చేసి పెట్రోల్ పూసుకున్న వేలిని అక్కడ తాకించాడు. దీంతో వెంటనే వేలికి మంట అంటుకుంది.

Viral Video: వధువును నిండా ముంచిన వింత సాంప్రదాయం.. పెళ్లిపీటలపై ఉన్నట్టుండి ఓ వ్యక్తి చేసిన పని చూడండి..

తర్వాత మండుతున్న వేలితో సిగరెట్ అంటించుకున్నాడు. అయితే సిగరెట్ వెలిగించుకున్న వెంటనే మంటను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వీడి పిచ్చి పీక్స్‌కి వెళ్లింది’’.., ‘‘ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం’’.., ‘‘ఇలాంటి వారి వల్ల మిగతా వారు ప్రమాదంలో పడతారు’’.., ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు’’.., అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women: తల్లితో పాటూ స్కూటీలో వెళ్లి.. నది ఒడ్డున రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి.. ఉదయం స్థానికులు వెళ్లి చూడగా..

Updated Date - 2023-10-20T10:18:45+05:30 IST