Share News

Viral Video: బుల్లెట్ బైకుపై మహిళ భయంకర స్టంట్.. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఒంటి చేత్తో..

ABN , First Publish Date - 2023-10-19T17:14:04+05:30 IST

ప్రస్తుతం దసరా శనరన్నవరాత్రుల సందర్భంగా సంబరాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అక్కడి సాంప్రాదాయాలను అనుసరించి వేడుకులు ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమలోని టాలెంట్‌ను సైతం బయటపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ...

Viral Video: బుల్లెట్ బైకుపై మహిళ భయంకర స్టంట్.. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఒంటి చేత్తో..

ప్రస్తుతం దసరా శనరన్నవరాత్రుల సందర్భంగా సంబరాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అక్కడి సాంప్రాదాయాలను అనుసరించి వేడుకులు ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమలోని టాలెంట్‌ను సైతం బయటపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వినూత్న వేడుకలు, వినూత్న విస్యానాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ చేసిన విన్యాసం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దసరా వేడుకల సందర్భంగా ఓ మహిళ బుల్లెట్ బైకుపై భయంకర విన్యాసం చేసింది. ఒంటి చేత్తో ఆమె చేసిన స్టంట్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దసరా (Dussehra) సందర్భంగా చాలా ప్రాంతాల్లో గర్బా వేడుకలు (Garba celebrations) నిర్వహిస్తుంటారు. అయితే ఈ వేడుకల సందర్భంగా ఓ మహిళ చేసిన విన్యాసం (Woman stunts on bike) అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దస్తులు ధరించిన మహిళ బుల్లెట్ బైకుపై వేడుకలు జరిగే ప్రాంతానికి వస్తుంది. బుల్లెట్ బైక్ (Bullet bike) నడపడమే కష్టం అనుకుంటే.. ఆమె మరో విన్యాసం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కాస్త దూరం బైకులో వచ్చిన ఆమె.. సడన్‌గా ఓ చేయిని వదిలేస్తుంది. ఒంటి చేత్తో హ్యాండిల్ పట్టుకుని మరో చేత్తో తన వద్ద ఉన్న పెద్ద కత్తిని బయటికి తీస్తుంది.

Viral Video: హ్యాండ్ బ్యాగు నుంచి సైకిల్‌ను బయటికి తీసిన మహిళ.. అప్పటి కాలంలోనే ఎంత టెక్నాలజీ ఉండేదో చూడండి..

కత్తిని గాల్లో అటూ ఇటూ తిప్పుతూ, మరోవైపు ఒంటి చేత్తో బైకు నడుపుతూ రౌండ్లు వేస్తుంది. దీంతో చుట్టూ ఉన్న వారంతా చప్పట్లు కొడుతో ఆమెను మరింత ఎంకరేజ్ చేస్తుంటారు. బైకును ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఆమె చేసిన విన్యాసం అక్కడున్న వారిని ఎంతో ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ మహిళ ట్యాలెంట్ మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘ఈమె వల్ల వేడుకలకే అందం వచ్చింది’’.. అని మరికొందరు, ‘‘చూడముచ్చటగా ఉంది.. సూపర్’’.. మరి ఇంకొందరు, అలాగే చాలా మంది వివిధ రకాల ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: యాపిల్స్ ఇచ్చుకో.. ఐఫోన్ తీసుకో.. మహిళకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కోతి..

Updated Date - 2023-10-19T17:14:04+05:30 IST