Viral Video: వామ్మో.. పిడుగు ఇలా కూడా పడుతుందా? ఒకే ప్రాంతంలో వెంట వెంటనే రెండు సార్లు.. వీడియో చూస్తే..

ABN , First Publish Date - 2023-03-25T16:48:21+05:30 IST

``పిడుగు ఓకే ప్రాంతంలో రెండుసార్లు పడదు`` అని ఇంగ్లీష్‌లో ఓ సామెత. అయితే ఈ వీడియో చూస్తే ఇకపై ఆ సామెత తప్పని అంగీకరించాల్సిందే.

Viral Video: వామ్మో.. పిడుగు ఇలా కూడా పడుతుందా? ఒకే ప్రాంతంలో వెంట వెంటనే రెండు సార్లు.. వీడియో చూస్తే..

``పిడుగు ఓకే ప్రాంతంలో రెండుసార్లు పడదు`` అని ఇంగ్లీష్‌లో ఓ సామెత. అయితే ఈ వీడియో చూస్తే ఇకపై ఆ సామెత తప్పని అంగీకరించాల్సిందే. OddIy Terrifying అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఎంతో మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియోలో ఒకే ప్రాంతంపై వెంట వెంటనే పెద్ద పెట్టున పిడుగుల (Lightning) వర్షం కురిసింది. ఆ ధాటికి ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఒక వ్యక్తి తన ఇంటి బాల్కనీలో నిల్చుని ఆకాశాన్ని వీడియో తీస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఇంటికి సమీపంలో పిడుగు పాటు మొదలైంది. ఒకే చెట్టుపై వెంట వెంటనే పిడుగులు పడ్డాయి (Lightning struck same spot twice). వెంటనే ఆ చెట్టుపై మంటలు వ్యాపించాయి. ఈ వీడియో ఒక్క రోజులోనే బాగా వైరల్ అయింది. ఏకంగా 1.6 కోట్ల మంది ఈ వీడియోను చూశారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్స్ కూడా చేశారు. పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు (Shocking Videos).

నేను చనిపోవడానికి సిద్ధం.. ఇంటికి మాత్రం వెళ్లను.. 17 ఏళ్ల యువతి చెప్పింది విని పోలీసులు షాక్.. అసలు కథేంటంటే..

``ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మీరు బయట చిక్కుకుంటే, భవనం లేదా వాహనంలో ఆశ్రయం పొందడం ఉత్తమం. బహిరంగ మైదానాలు, చెట్ల వంటి వాటికి దగ్గరగా ఉండకండి. వేరే ఆశ్రయం అందుబాటులో లేనపుడు నేలపైకి వంగి ఉండండి`` అని ఓ వ్యక్తి జాగ్రత్తలు చెప్పారు.

Shocking: స్నేహితుడు కదా అని నమ్మితే దారుణం.. యువతిని గదిలో బంధించి పరారు.. అతడి ప్లాన్ ఏంటంటే..

Updated Date - 2023-03-25T16:49:42+05:30 IST