`నేను చనిపోవడానికి సిద్ధం.. ఇంటికి మాత్రం వెళ్లను`.. 17 ఏళ్ల యువతి చెప్పింది విని పోలీసులు షాక్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-03-25T16:09:04+05:30 IST

ఆ యువతి వయసు17 సంవత్సరాలు.. 7 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమెకు ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.. నాలుగు, ఐదు రోజుల తర్వాత ఆ యువతి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది..

`నేను చనిపోవడానికి సిద్ధం.. ఇంటికి మాత్రం వెళ్లను`.. 17 ఏళ్ల యువతి చెప్పింది విని పోలీసులు షాక్.. అసలు కథేంటంటే..

ఆ యువతి వయసు17 సంవత్సరాలు.. 7 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా ద్వారా ఆమెకు ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.. నాలుగు, ఐదు రోజుల తర్వాత ఆ యువతి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది.. ఆ తర్వాత వారి మధ్య ఛాటింగ్ మొదలైంది.. ఆ తర్వాత ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.. దాదాపు రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరు ఐ లవ్యూ (Love) చెప్పుకున్నారు.. ఇంతలో ఆ యువకుడికి పెళ్లి కుదిరింది.. దీంతో వారిద్దరూ ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఆ యువతి తన ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, కొంత నగదు అపహరించి పారిపోయి పోలీసులకు దొరికిపోయింది.

Viral: లాటరీ గెలిచిన వెంటనే భర్తను మార్చేసిన మహిళ.. షాకింగ్ విషయం తెలుసుకున్న మాజీ భర్త ఏం చేశాడంటే..

పశ్చిమ బెంగాల్‌కు (West Bengal) చెందిన 17 ఏళ్ల యువతి మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) విదిషా జిల్లాలో ఉన్న తన ప్రేమికుడిని కలవడానికి 35 గంటల పాటు ప్రయాణించింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని ట్రేస్ చేసి ఆమె గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఓ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. తన ప్రియుడిని కలవకుండా ఎక్కడికీ వెళ్లనని పట్టుబడుతోంది. చనిపోవడానికైనా సిద్ధం కానీ, తిరిగి ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.

Shocking: స్నేహితుడు కదా అని నమ్మితే దారుణం.. యువతిని గదిలో బంధించి పరారు.. అతడి ప్లాన్ ఏంటంటే..

ఆ అమ్మాయి, ఆమె ప్రియుడు కూడా మైనర్లు కావడంతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిషన్ అధికారులు వారి బాధ్యతను తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని నచ్చ చెబుతున్నారు. ఆ యువతి తల్లిదండ్రులను విదిశకు పిలిపించారు. ఆ యువతిని ఇంటికి పంపించేదీ, లేనిదీ కౌన్సిలింగ్ తర్వాత నిర్ణయిస్తారు.

Updated Date - 2023-03-25T16:09:04+05:30 IST