Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

ABN , First Publish Date - 2023-03-01T17:43:47+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది.

Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది. తాజాగా ఆమె ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో ఆమె అప్‌సెట్‌కు గురయింది. జవాబివ్వడానికి ఇది సరైన వేదిక కాదంటూ రిప్లై ఇచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) ను హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ‘షెహజాదా’ (Shehzada) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయితే, కృతి సనన్ తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్స్‌లో సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘కార్తిక్ ఆర్యన్‌లో మీకు నచ్చిన అంశం ఏంటీ’’ అని అడిగారు. ఈ ప్రశ్నతో ఆమె కొంచెం కోపం తెచ్చుకుంది. అయినప్పటికి నవ్వుతూ సమాధానమిచ్చింది. ‘‘అటువంటి విషయాలకు సమాధానమివ్వడానికి ఇది సరైన వేదికేనా’’ అని కృతి సనన్ రిప్లై ఇచ్చింది.

కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T18:02:36+05:30 IST