Kitchen Wastes: కూరగాయల తొక్కల నుంచి.. వాడేసిన టీ పౌడర్ వరకు.. తెలియక వంటింట్లోని చెత్త బుట్టలో పారేస్తున్నారు కానీ..!

ABN , First Publish Date - 2023-09-07T16:49:30+05:30 IST

పండ్ల తొక్కల నుండి వాడేసిన టీ పొడి వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.

Kitchen Wastes: కూరగాయల తొక్కల నుంచి.. వాడేసిన టీ పౌడర్ వరకు.. తెలియక వంటింట్లోని చెత్త బుట్టలో పారేస్తున్నారు కానీ..!

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతోమంచివి, వీటిలో పోషకాలు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. వీటిని వండేముందు, తినేముందు శుభ్రంగా కడటం, ఆ తరువాత తొక్క తీయడం తప్పనిసగి. ఈ తొక్కలన్నీ తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తుంటాం. ఆ తరువాత వీటిని చెత్తకుప్ప దగ్గర పారేస్తుంటాం. కానీ కూరగాయలు, పండ్ల తొక్కల నుండి వాడేసిన టీ పొడి వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. ఇంతకూ ఈ తొక్కలను, వ్యర్థాలను ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకంటే.

సాధారణంగా పండ్లు, కూరగాయలు తాజాగా, రసాయనాలు లేకుండా పండించినవి అయితే తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి వండేయచ్చు. తొక్కలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ రసాయనాల కారణంగా వీటి పొట్టు తీయక తప్పదు. అయితే ఈ పొట్టు మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ ఎరువులాగా(organic fertilizers) వీటిని వాడుకోవచ్చు. ఇప్పట్లో ప్రతి ఇంట్లో కొన్ని కుండీలు, వాటిలో కొద్దో గొప్పో కూరగాయలు, పండ్ల మొక్కలు ఉంటున్నాయి. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మిద్దెతోట పెంపకం చేపడతారు. అయితే ఇలా మొక్కలు పెంచడమంటే కేవలం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నీరు పోసి చేతులు దులుపుకోవడం కాదు. వాటికి మంచి ఎరువును అందించాలి. పండే పండ్లు అయినా కూరగాయలు అయినా ఇంటిల్లిపాదీ తింటారు కాబట్టి సేంద్రీయ ఎరువులు అందించడం మంచిది.

Viral Video: మోసం అనే పదానికే అర్థం తెలియని అమాయకురాలు.. రైల్లో వెళ్తూ గొర్రెకు కూడా టికెట్ తీసుకున్న బామ్మ..!



ప్రతిరోజు కూరగాయలు, పండ్ల(vegetable and fruit peels) మీద తొక్కలు తీసేస్తుంటారు. వీటిని ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కలు ఏపుగా పెరగడంలో, రుచికరమైన పండ్లు, కూరగాయలు ఇవ్వడంలో ఇవి బాగా సహాయపడతాయి. అలాగే ప్రతిరోజూ టీ, కాఫీ చేసుకోవడం ప్రతి ఇంట్లో జరిగేదే. వాడేసిన తరువాత టీ పొడి, కాఫీ పొడి(coffee, tea powder) చెత్తబుట్టలోకి వేయకుండా మొక్కల మొదలులో వేయవచ్చు. దీనివల్ల మొక్క దృఢంగా పెరుగుతుంది.

అరటి తొక్కల(banana peels)లో అరటిపండ్ల మాదిరిగానే పొటాషియం, పాస్పరస్, ఇతర సూక్ష్మపోషకాలు ఉంటాయి. పెరుగుతున్న మొక్కలకు అరటిపండు తొక్కలను ఎరువుగా వేయడం వల్ల బాగా ఎదుగుతాయి. అరటిపండు తొక్కలు చిన్నగా కట్ చేసి అయినా వేయవచ్చు. లేదా అరటిపండు తొక్కలు పేస్ట్ చేసి అయినా మొక్కలకు వేయవచ్చు.

మొక్కలు బాగా పెరగడానికి కాల్షియం బాగా అవసరం. గుడ్డు పెంకు(egg shells)లో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. గుడ్డు పెంకులను బాగా ఆరబెట్టి తరువాత మెత్తగా పొడి చేసి మొక్కలకు ఎరువులాగా చల్లవచ్చు. ఇదే విధంగా పిస్తా, వేరుశనగ, వాల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి విత్తనాల పొట్టులు(nuts shells) కూడా మంచి ఎరువుగా పనిచేస్తాయి ఈ పొట్టు పడేయకుండా నేరుగా కుండీలలో వేయవచ్చు, లేదంటే వీటిని మిక్సీ పట్టి పొడిలా చేసి కూడా వాడుకోవచ్చు.

అన్నింటికంటే కాస్త షాక్ గా అనిపించేది టిష్యూ పేపర్(tissue paper). వంటింట్లో ఉపయోగించే టిష్యూ పేపర్లు కూడా మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. వాడేసిన టిష్యూ పేపర్లు కాస్త తడి చేసి వాటిని మొక్కల కుండీలలో వేయాలి. అయితే వీటిని ఎక్కువ మొత్తం వేయకూడదు.

Curd: పెరుగు పులుపెక్కిందా..? ఈ టెక్నిక్‌తో దాని రుచిని మళ్లీ మార్చేయడం యమా ఈజీ..!


Updated Date - 2023-09-07T16:49:30+05:30 IST