Viral Video: మోసం అనే పదానికే అర్థం తెలియని అమాయకురాలు.. రైల్లో వెళ్తూ గొర్రెకు కూడా టికెట్ తీసుకున్న బామ్మ..!

ABN , First Publish Date - 2023-09-07T13:59:01+05:30 IST

రైలు ప్రయాణం చేసేవారిలో టికెట్ తో ప్రయాణించేవారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ. కానీ ఈ బామ్మ మాత్రం..

Viral Video: మోసం అనే పదానికే అర్థం తెలియని అమాయకురాలు.. రైల్లో వెళ్తూ గొర్రెకు కూడా టికెట్ తీసుకున్న బామ్మ..!

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోణ వేదిక. ఇందులో ప్రయోణించేవారి విషయానికి వస్తే టికెట్ తో ప్రయాణించేవారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ. సాధారణ కంపార్ట్మెంట్లలోకి టికెట్ ఎగ్జామినర్ వచ్చి చెకింగ్ చెయ్యడులే అనే నిర్లక్ష్యంతో ఇలాగే చేస్తుంటారు. ఇక చిన్నచిన్న వ్యాపారస్తులు, పనులు చేసుకునేవారు కూడా చాలావరకు టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. కానీ ఓ బామ్మ మాత్రం ఇందుకు మినహాయింపు. ట్రైన్ ప్రయాణం చేస్తూ గొర్రెకు కూడా టికెట్ కొనడంతో ఈమె అందరి మనసులు దోచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీవివరాల్లోకి వెళితే..

మంచిని కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఉపయోగించుకుంటున్న కాలమిది. కానీ ఏ గుర్తింపు ఆశించకుండా తమ పనిని తాము చేసుకుపోయేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ బామ్మ కూడా అలాంటిదే. వీడియోలో రైల్లో ఓ బామ్మ(old women) ప్రయణిస్తోంది. ఆమె గొర్రెలు మేపుకుని, కష్టం చేసుకుని బ్రతికేది. అదే ట్రైన్లో టికెట్ చెకింగ్ నిమిత్తం టికెట్ ఎగ్జామినర్(TTE) తిరుగుతున్నాడు. ట్రైన్లోని బోగీలో మూసి ఉన్న ఎంట్రన్స్ గేట్ వద్ద నిలబడుకున్న బామ్మను, ఆమె పక్కనున్న గొర్రెను(sheep) చూశాడు. ఆయన ఆ బామ్మను టికెట్ చూపించమని అడిగాడు. ఆమె పక్కనే ఓ వ్యక్తికి చెప్పడంతో అతను బామ్మ టికెట్ తీసి చూపించాడు. ఆ తరువాత టికెట్ ఎగ్జామినర్ 'మీ గొర్రెకు టికెట్ తీసుకున్నారా?' అని అడిగాడు. దీంతో ఆమె తన గొర్రె కోసం కొనుగోలు చేసిన ఇంకొక టికెట్ ను కూడా చూపించమని చెప్పింది(old women buy a ticket for her goat). ఆ రెండవ టికెట్ చూడగానే టికెట్ ఎగ్జామినర్ చాలా సంతోషించారు. టికెట్ చూపిస్తున్నప్పుడు ఆ బామ్మ ముఖంలో ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఆమె నవ్వులో స్పష్టంగా కనిపించాయి. టికెట్ కలెక్టర్ కు, బామ్మకు మధ్య సంభాషణ బెంగాళీ(Bengali) భాషలో జరుగుతున్నందున ఇది పశ్చిమ బెంగాల్(West Bengal) లో జరిగిన సంఘటనగా చెబుతున్నారు.

Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!



ఈ వీడియోను Awanish Sharan అనే ఐఏఎస్ అధికారి(IAS officer) తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఆమె తన గొర్రె కోసం టికెట్ కొనుగోలు చేసిందని చెప్పడంతో పాటు 'ఆమె నవ్వు చూడండి ఎంత అద్భుతంగా ఉందో' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ బామ్మ నిజాయితీకి ఫిదా అయిపోతున్నారు. 'ఆమె నిజాయితీ, ఆమె ఆత్మవిశ్వాసం ఆమె నవ్వులో కనిపిస్తున్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'టికెట్ లేకుండా ప్రయాణం చేసే చదువుకున్నవారు ఈ బామ్మను చూసి సిగ్గుపడాలి' అని మరికొందరు అంటున్నారు. 'కల్మషం లేని ఆమె నవ్వు ఎంత అందంగా ఉందో' అని మరొకరు అన్నారు.

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!


Updated Date - 2023-09-07T14:31:52+05:30 IST