Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2023-09-06T17:10:32+05:30 IST

30రోజులు కాఫీ, టీ తాగడం మానేస్తే ఇన్ని మార్పులు జరుగుతాయని మీకు తెలుసా?

Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!

కాఫీ, టీలు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయాయి. ఉదయాన్నే కాఫీ గొంతులో పడకపోతే ఏ పని మొదలుపెట్టబుద్ది కాదు, ఇక న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ ఆస్వాదించడం కొందరికి ఇష్టం. ఆఫీసులో పనిమీద విసుగు వస్తే అలా వెళ్లి కాఫీ తాగి తిరిగి చురుగ్గా మారుతుంటారు. స్నేహితులతో కబుర్లకు కాపీ, టీ షాపులు మంచి కేంద్రకాలు. సాయంత్రం ఏవైనా స్నాక్స్ తింటూ కాఫీ, టీ తాగితే ఆ మజా వేరు. ఇలా ఒకటి రెండూ కాదు కాఫీ, టీ తీసుకునే సందర్భాలు కోకొల్లలు. కానీ 30రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆసక్తికరమైన విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కాఫీ ఓ గొప్ప ఉత్ప్రేరకం. రోజూ కాఫీ తాగడం అలవాటైనవారు ఎప్పుడైనా కాపీ స్కిప్ చేస్తే తలనొప్పి, చిరాకు, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ కాఫీ తాగడాన్ని క్రమం తప్పకుండా 30రోజులు మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా ఎప్పుడైనా నిద్ర ముంచుకొస్తే దాన్ని అదుపు చేసుకోవడానికి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వీటిలోని కేఫిన్ నిద్రను కంట్రోల్ చేస్తుంది. 30రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే నిద్ర సమస్యలు అన్నీ మంత్రించినట్టు పరిష్కారం అవుతాయి.

కొంతమంది కాఫీ, టీ గొంతులో పడంది ఏ పని చేయలేరు. ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. కాఫీ,టీలలో ఉండే కేపీన్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోకపోతే ఏ పని చేయనివ్వనంత దారుణ స్థితికి మారుస్తుంది. కాఫీ, టీ తీసుకోవడం మానేస్తే శరీర పనితీరు సహజంగా సమర్థవంతంగా మారుతుంది.

Woman Health: అమ్మాయిలూ.. చిన్న కడుపునొప్పి వచ్చినా డాక్టర్‌ను కలవండంటూ.. ఈ 25 ఏళ్ల యువతి ఎందుకు చెప్తోందంటే..!



కాఫీ, టీ లలో ఆమ్లగుణం ఉంటుంది. కొన్నిసార్లు ఇది జీర్ణసంబంధ సమస్యలకు కారణం అవుతుంది. కాఫీ, టీ మానేయడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. అజీర్ణానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.

కాఫీ శరీరానికి వేడిచేస్తుంది. కాఫీ ఎక్కువగా తీసుకునేవారి శరీరంలో తేమ శాతం తొందరగా తగ్గిపోతుంది. ఈ కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. కాఫీ, టీ తాగడం 30రోజుల పాటు మానేస్తే శరీరం సాధారణ ఉష్ట్రోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది.

అధికబరువుతో ఇబ్బంది పడేవారిని కాఫీ, టీ తీసుకోవడం మానేయమని సలహా ఇస్తుంటారు. పాలు, చక్కెర, క్రీమ్ తో కలిసిన కాఫీ,టీ లు బరువు పెరగడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాయి. శారీరక శ్రమ ఎక్కువ చేయనివారు కాఫీ,టీ కు దూరంగా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Hyderabad vs Bangalore: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా.. ప్రతి నెలా రూ.40 వేలు సేఫ్.. నెట్టింట రచ్చ లేపిన ఓ టెకీ పోస్ట్..!


Updated Date - 2023-09-06T17:10:32+05:30 IST