Reel: హైవేపై కారు ఆపి ఓ యువతి చేసిన పనిది.. భారీగా ఫైన్ విధింపు

ABN , First Publish Date - 2023-01-23T20:33:38+05:30 IST

ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా (Social media) యుగం. వేర్వేరు మాధ్యమాలు వేర్వేరు ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్(Instagram) రీల్స్ (Reels) ఒకటి.

Reel: హైవేపై కారు ఆపి ఓ యువతి చేసిన పనిది.. భారీగా ఫైన్ విధింపు

ఘజియాబాద్: ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా (Social media) యుగం. వేర్వేరు మాధ్యమాలు వేర్వేరు ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్(Instagram) రీల్స్ (Reels) ఒకటి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ (Instagram Influencers) తమదైన స్టైల్‌లో అలరించడం పరిపాటిగా మారిపోయింది. ఫాలోయర్ల సంఖ్యను పెంచుకునేందుకు విభిన్నమైన రీల్స్‌తో ముందుకొచ్చే ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు ఒక్కోసారి అనూహ్యమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) ఘజియాబాద్‌కు చెందిన వైశాలి చౌదరి ఖుతైల్ (Vaishali Chaudhary Khutail) అనే యువతికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో పూర్తి వివరాల్లో వెళ్లిపోదాం..

Untitled-4.jpg

వైశాలి చౌదరి ఖుతైల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ (Insta reel) రికార్డింగ్ కోసం హైవే మధ్యలో కారు ఆపింది. ఒక పక్క నడుస్తూ ఫొటోకి పోజులిచ్చింది. పక్కనే వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా వీడియో రికార్డ్ చేసింది. మొత్తానికి ఆ రీల్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే వైరల్‌గా మారిన ఈ రీల్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. కనీస బాధ్యత లేకుండా నడిరోడ్డుపై ఇలా చేయడమేంటంటూ ఫాలోయర్స్ తప్పుబట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.17 వేల జరిమానా విధించినట్టు ట్వీటర్ వేదికగా తెలిపారు. దీంతో షాక్‌కు గురవ్వడం వైశాలి చౌదరి ఖుతైల్ వంతైంది. కాగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన వైశాలికి ఇన్‌స్టాలో 6,50,000లకుపైగా ఫాలోయర్లు ఉన్నారు.

Updated Date - 2023-01-23T20:34:03+05:30 IST