Indian Railway: ఎదురుగా ఉన్న రైల్లోని ఓ బోగీలోకి ఉత్కంఠగా చూస్తూ.. ప్లాట్‌ఫామ్‌పై వందల కొద్దీ ప్రయాణీకుల నిరీక్షణ.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-05-02T20:05:14+05:30 IST

తాము ఎక్కాల్సిన రైలు కోసం పరుగులూ తీయలేదు, హాడావిడీ పడలేదు. అందుకు బదులుగా ఎదురుగా ఉన్న రైలు బోగీలోకి చూస్తూ చాలా టెన్షన్ అనుభవించారు. వందలకొద్దీ ప్రయాణీకులు అసలేమవుతుంది భగవంతుడా.. అని ఎదురు చూస్తూ..

Indian Railway: ఎదురుగా ఉన్న రైల్లోని ఓ బోగీలోకి ఉత్కంఠగా చూస్తూ.. ప్లాట్‌ఫామ్‌పై వందల కొద్దీ ప్రయాణీకుల నిరీక్షణ.. అసలేం జరిగిందంటే..!

నిత్యం రద్దీగా ఉండే ఆ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకుంది. రైల్వే ప్లాట్ పామ్ పై వందల కొద్దీ ప్రయాణికులు ఉన్నారు, కానీ వారు తాము ఎక్కాల్సిన రైలు కోసం పరుగులూ తీయలేదు, హాడావిడీ పడలేదు. అందుకు బదులుగా ఎదురుగా ఉన్న రైలు బోగీలోకి చూస్తూ చాలా టెన్షన్ అనుభవించారు. వందలకొద్దీ ప్రయాణీకులు అసలేమవుతుంది భగవంతుడా.. అని ఎదురు చూసిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కొన్ని సార్లు సమస్య మనది కాకపోయినా.. మనమే సమస్యలో ఉన్నట్టు బాధపడతాం. ఏమి జరుగుతుందో అన్నంత ఫీలవుతాం. 'దేవుడా అంతా మంచి జరిగేలా చూడు' అని భగవంతుడిని వేడుకుంటాం. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఖుషీనగర్ లోని కప్తంగంజ్ రైల్వేస్టేషన్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అవధ్ ఎక్స్‌ప్రెస్(avadh express) రైలులో బీహార్‌(Bihar)లోని సవాల్ బగాహా నివాసి ఖుష్బూ ఖాతూన్‌ తన భర్తతో కలిసి ప్రయాణిస్తోంది. ఆమె నెలలు నిండిన గర్బవతి. రైలు కుషీనగర్‌లోని కప్తంగంజ్ స్టేషన్‌కు చేరుకోబోతుండగా ఆమెకు ప్రసవం నొప్పులు(delivery pains) మొదలయ్యాయి. ఆమె భర్తకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అతను వెంటనే రైల్వే హెల్ప్ లైన్ కు(railway help line) ఫోన్ చేసి తన భార్య పరిస్థితిని వివరించాడు. అతను చెప్పింది వినగానే రైల్వే ఆరోగ్యశాఖ(railway health department) వెంటనే అప్రమత్తమైంది. రైలు కప్తంగంజ్ చేరుకోవడానికి ముందే ఆరోగ్య శాఖ బృందం ప్లాట్ ఫామ్ కు చేరుకుంది. అక్కడ అవధ్ ఎక్స్పెస్ ను ఆపేశారు.

Crime News: వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఆపి కారులో ఏమున్నాయా అని వెతికితే..


అవధ్ ఎక్స్ఫెస్ లో జనరల్ కోచ్(general coach) లో ఉన్న ఖుష్భూ దగ్గరకు వెళ్లి ఆ బోగీలో ఉన్న ప్రయాణీకులను కిందకు దించేశారు. గర్భిణికి ఏమవుతుందో ఏమోనని ప్రయాణీకులందరూ ఎంతో ఉత్కంఠగా రైలు బోగీ వైపే చూస్తూ కాలం గడిపారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ ఎంతో నిశ్శబ్దంగా మారిపోయింది. చాలామంది ఆ మహిళకు సుఖప్రసవం కావాలంటూ దేవుడిని ప్రార్థించారు. అందరి నిరీక్షణకు తెరదించుతూ కొద్దిసేపటిలోనే రైలు బోగీ నుండి శిశువు ఏడుపు వినిపించింది. బిడ్డ ఏడుపు వినిపించగానే రైల్వే ప్లాట్ ఫామ్ మీద ప్రయాణికులందరూ తమ కుటుంబంలో మహిళే ప్రసవం అయినట్టు సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రైల్వే ఆరోగ్యశాఖ స్పందించిన విధానాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఖుష్బూ భర్త ఖుష్బూకు డెలివరీ చేసిన రైల్వే ఆరోగ్యశాఖ జనరల్ ఫిజీషియన్(general physician) సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపాడు. తల్లీ-బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అవధ్ ఎక్స్ఫెస్ లోనే వారు తాము వెళ్లాల్సిన ఊరికి వెళ్ళిపోయారు.

Viral News: మురికి కాల్వలో ఓ యువతి మృతదేహం.. జేసీబీతో పూడిక తీస్తోంటే షాకింగ్ దృశ్యం.. ఏడాది క్రితమే చనిపోయిందని రిపోర్టులు రావడంతో..


Updated Date - 2023-05-02T20:22:02+05:30 IST