Crime News: వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఆపి కారులో ఏమున్నాయా అని వెతికితే..

ABN , First Publish Date - 2023-05-02T16:45:31+05:30 IST

వేగంగా కారు వెళ్తోంటే.. దాన్ని వెంబడిస్తూ పోలీస్ జీపు రాకెట్ లా దూకుపోయింది. ఈ ఛేజింగ్ సీన్ లో పోలీసులే గెలిచారు. కారును అడ్డుకున్న పోలీసులు కారులో ఏముందోనని వెతగ్గా దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది వారికి.

Crime News: వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఆపి కారులో ఏమున్నాయా అని వెతికితే..

సినిమాల్లో ఛేజింగ్ సీన్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారో.. టాటాసుమోనో వేగంగా వెళుతూంటుంది. దాన్ని వెంబడిస్తూ వెనక పోలీస్ జీపు దూసుకుపోతుంది. కారులో దొంగలు దొరుకుతారా? లేదా తప్పించుకుంటారా? అని ఎంతో టెన్షన్ పడుతూ చూస్తూంటాం. అది సినిమానే అయినా టెన్షన్ పడతాం, కానీ అలాంటి సీన్ రియల్ గా జరిగింది. వేగంగా కారు వెళ్తోంటే.. దాన్ని వెంబడిస్తూ పోలీస్ జీపు రాకెట్ లా దూకుపోయింది. ఈ ఛేజింగ్ సీన్ లో పోలీసులే గెలిచారు. కారును అడ్డుకున్న పోలీసులు కారులో ఏముందోనని వెతగ్గా దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది వారికి. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

గుజరాత్(Gujarat) రాష్ట్రం సూరత్(Surat) పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఎయిర్పోట్ కు(Airport) బయలుదేరారు. వారు అక్కడికి అలా చేరుకోగానే ఓ కారు హడావిడిగా ఎయిర్పోర్ట్ నుండి బయటకు పరుగులు తీసింది. ఆ కారు అమితమైన వేగంతో వెళుతుండటం చూసిన పోలీసులకు దానిమీద అనుమానం వచ్చింది. వారు వెంటనే ఆ కారును వెంబడించారు. ఈ ఛేజింగ్ సినిమాల్లో పోలీసులు దొంగలను వెంబడించినట్లే సాగింది. చివరికి పోలీసులు ఆ కారును ఆపగా.. అందులో నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులు వారిని పట్టుకుని కారును సోదా చేశారు. కారులో వారికి బంగారం కనిపించింది, అది పౌడర్, లిక్విడ్(powder, liquid gold) రూపంలో ఉండటంతో పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఆ బంగారం విలువ లెక్కగట్టగా అక్షరాలా 4.3కోట్లని తేలింది. దీని గురించి నిందులను పోలీసులు విచారించారు. తాము దుబాయ్(Dubai) నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు దుండగులు ఒప్పుకున్నారు. బంగారాన్ని మొదట రసాయనాలలో ముంచి దాన్ని లిక్విడ్ రూపంలోనూ, పౌడర్ రూపంలోనూ మారుస్తున్నారు. అలా మారిన బంగారాన్ని లోదుస్తులలోనూ(inner wares), షూస్(shoes) లోనూ దాచిపెట్టి తీసుకొస్తున్నట్టు వారు తెలిపారు. ఇలా చేయడం వల్ల ఎయిర్పోర్ట్ లో మెటల్ డైరెక్టర్ లు దాన్ని గుర్తించడం లేదు. ఈ పద్దతిలో బంగారాన్ని ఒక్కసారి స్మగ్లింగ్ చేస్తున్నందుకు వారికి 25నుండి 30వేల(25 to 30 thousand rupees) రూపాయలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!


సూరత్ నగరంలో గత ఆరునెలల నుండి పెద్ద ఎత్తున బంగారం హల్చల్ చేస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీని గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో దుబాయ్ నుండి సూరత్ కు బంగారం స్మగ్లింగ్(gold smuggling from Dubai to Surat) చేస్తున్నారని, ప్రస్తుతం సూరత్ ఎయిర్పోట్ కు చేరుతోందని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ గోల్డ్ స్మగ్లర్స్ ను పట్టుకోవడం పోలీసులకు మరింత సులువయ్యింది . దుబాయ్ నుండి తెచ్చిన బంగారం ఎవరికి ఇస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారిప్పుడు.

Viral Video: పెళ్లి వేడుకల్లో ఓ వధువుకు ఊహించని షాక్.. అప్పటిదాకా పక్కన కూర్చున్న వరుడు సడన్‌గా లేచి వెళ్లిపోయి..!


Updated Date - 2023-05-02T16:45:31+05:30 IST