Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2023-05-01T18:16:06+05:30 IST

ఓ కారు డ్రైవర్ తన కారు వెనుక భాగంలో డిక్కీ డోర్ తొలగించి, ఆ స్థానంలో ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి పెద్ద దారుణమే చేశాడు.

Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!

గ్రామాలు, పట్టణాల్లో షేర్ ఆటోలలో ఎప్పుడైనా ప్రయాణించారా? 7లేదా 8మంది కూర్చోవలసిన ఆ ఆటోలలో పరిధికి మించి జనాల్ని కుక్కేస్తుంటారు. తప్పని పరిస్థితి కావడంతో చాలామంది అలాగే ప్రయాణాలు చేస్తుంటారు. ఇలా ప్రయాణించేవారిలో పేదవారే ఎక్కువగా ఉంటారు. ఓ కారు డ్రైవర్ తన కారు వెనుక భాగంలో డిక్కీ డోర్ తొలగించి, ఆ స్థానంలో ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి పెద్ద దారుణమే చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు పైర్ అవుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

డబ్బు కోసం కక్కుర్తి పడి ఎదుటివారి ప్రాణాలను పణంగా పెట్టేవారు చాలామంది ఉంటారు. గ్రామాల్లో పట్టణాల్లో షేర్ ఆటోలలోనూ, ప్రైవేట్ బస్సులలోనూ పరిధికి మించి జనాల్ని ఎక్కించుకుని తిరిగే వాహనాలు బోలెడు ఉంటాయి. ఓ కారు డ్లైవర్(car driver) అంతకంటే ఎక్కువే కక్కుర్తి పడ్డాడు. అతను కారు వెనుక భాగంలో డిక్కీ డోరు తొలగించేశాడు(remove dicky door). అప్పుడు ఆ భాగం తెరవబడిన కబోర్డ్ లా ఉంది. దానికి అతను ఇనుప చువ్వలతో(iron rods) తయారు చేసిన ఒక తలుపును(iron rods door) సెట్ చేశాడు. చూడ్డానికి జంతువులను తీసుకెళ్లడానికి ఉపయోగించే బోన్(Animals cage) లా కనిపిస్తోందది. అతను రోడ్డు మీద కారును పోనిస్తున్నప్పుడు అతని వెనక ప్రయాణికులు ఇదంతా గమనించారు. దారుణం ఏమిటంటే ఆ కారు డ్రైవర్, డిక్కీ భాగంలో ఏర్పాటుచేసిన తలుపు లోపల ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక పాప కారు ప్రయాణంలో కుర్చున్న చోటునుండి పైకి లేచి ఆ తలుపు నుండి బయటకు తల పెట్టడం కనిపిస్తుంది. పాకిస్తాన్(Pakistan) లోని కరాచీ(Karachi) నుండి ఈ వీడియో బయటకు వచ్చింది.

Viral Photo: ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. నోరు తెరిచి చెప్పలేదు.. ఈ కుర్రాడి ప్రపోజల్ కు అమ్మాయి ఫిదా .. ఇంతకూ అతనేం చేశాడంటే..


ఈ వీడియోను mangobaaz అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కార్ డ్లైవర్ పట్ల ఫైర్ అవుతున్నారు. 'పిల్లలకు అసలు సేఫ్టీ లేదు.. అలా ఎలా తీసుకెళుతున్నారు?' అని మండిపడుతున్నారు. 'పిల్లలను అలా కూర్చోబెట్టిన వారికి కనీస జ్ఞానం లేదు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'పొరపాటున ఏదైనా వాహనం వెనుక నుండి ఢీ కొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి?' అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

24-Carat Gold Tea: జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి టీ తాగాల్సిందే.. 24 క్యారెట్ల గోల్డ్ టీ.. ఖరీదు మరీ ఇంత తక్కువా..?


Updated Date - 2023-05-01T18:16:06+05:30 IST