Viral Photo: ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. నోరు తెరిచి చెప్పలేదు.. ఈ కుర్రాడి ప్రపోజల్ కు అమ్మాయి ఫిదా .. ఇంతకూ అతనేం చేశాడంటే..

ABN , First Publish Date - 2023-05-01T16:40:43+05:30 IST

నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేసినప్పుడు వారు ఓకే చెబితే ప్రపంచాన్ని జయించినంత సంతోషమేస్తుంది. ఇప్పుడు ఓ కుర్రాడు అదే ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. ఫేమస్ ప్రాంతాలకు తీసుకెళ్లలేదు.. కేవలం

Viral Photo:  ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. నోరు తెరిచి చెప్పలేదు.. ఈ కుర్రాడి  ప్రపోజల్ కు అమ్మాయి ఫిదా .. ఇంతకూ అతనేం చేశాడంటే..

ఇప్పట్లో ప్రేమించడం కామన్.. ప్రపోజ్ చేయడం కామన్.. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేసినప్పుడు వారు ఓకే చెబితే ప్రపంచాన్ని జయించినంత సంతోషమేస్తుంది. ఇప్పుడు ఓ కుర్రాడు అదే ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. ఫేమస్ ప్రాంతాలకు తీసుకెళ్లలేదు.. కేవలం కంప్యూటర్ కీబోర్డు తీసుకెళ్లి అమ్మాయి చేతిలో పెట్టాడు అంతే.. ఆ కీబోర్డు చూసి అమ్మాయి ఫిదా అయిపోయింది. కుర్రాడి ప్రేమకు పచ్చ జెండా ఊపేసింది. 'కీబోర్డు చూసి ప్రేమకు పచ్చజెండా ఊపడమేంటి పిచ్చి కాకపోతే..' అనిపిస్తుంది అందరికీ కానీ.. అసలైన ట్విస్ట్ ఆ కీబోర్డులోనే ఉందట. ఓ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయికి వినూత్నంగా ప్రపోజ్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

ప్రేమిస్తున్నవారికి ప్రపోజ్ చేసినప్పుడు వారు ఓకే చెప్పి తిరిగి ప్రేమను పంచడానికి సిద్దపడితే ప్రపంచంలో తమకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అనిపిస్తుంది. ఓ అమ్మాయి 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో నాకు ప్రపోజ్(love proposal) చేశాడు, ఈ విషయాన్ని అందరికీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను' అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకుంది. కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కంప్యూటర్ కీబోర్డు(computer keyboard) ఉపయోగించాడు. ఆ కీబోర్డులో కీస్ రంగురంగులలో(Colour keys) చాలా అందంగా ఉన్నాయి. అతను ఆమెకు చెప్పాలని అనుకున్న విషయాన్ని కీబోర్డ్ లో ప్రెజెంట్ చేశాడు. కీబోర్డులో అతను ప్రపోజ్ చేసిన తేదీ(proposal date) ఉంది, దాని కింద 'BE MY GIRL FRIEND SAYANG?' అనే టెక్ట్స్ ను కీబోర్డ్ లో సెట్ చేశాడు. అది చూసి ఆ యువతి ఫిదా అయిపోయింది. కొత్త పద్దతిలో అలా ప్రపోజ్ చేయడం ఆమెకెంతో నచ్చింది చెబుతోంది. ఈ కీబోర్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

key.gif

24-Carat Gold Tea: జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి టీ తాగాల్సిందే.. 24 క్యారెట్ల గోల్డ్ టీ.. ఖరీదు మరీ ఇంత తక్కువా..?


@amymaymacc అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఆ అమ్మాయే ఈ ఫోటోను ట్విట్టర్ లోషేర్ చేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ వెరైటీ కీబోర్డుతో నాకు ప్రపోజ్ చేశాడు. దీన్ని చూసిన తరువాత నేను సైలెంట్ గా ఉండలేకపోతున్నాను' అని క్యాప్షన్ జతచేసింది. ఈ ఫోటో చూసిన వారు వినూత్న పద్దతిలో చేసిన ప్రపోజల్ ను ప్రసంశిస్తున్నారు. 'మీరు అతని ప్రేమను యాక్సెప్ట్ చెయ్యడానికి అతను సరైన కీస్ ను నొక్కాడు' అని కామెంట్స్ చేశారు. 'అతను చాలా వెరైటీగా ప్రయత్నించాడు, అతనిలో సృజనాత్మకత ఎక్కువగా ఉన్నట్టుంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఇప్పుడు మీ దగ్గరున్న కీబోర్డు చాలా ఖరీదైనది' అని మరొకరు అన్నారు. మొత్తానికి ఈ ఫోటో చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు.

మీకూ కోసిన పండ్లపైన చాట్ మసాలా, ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉందా? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే..


Updated Date - 2023-05-01T16:56:52+05:30 IST