మీకూ కోసిన పండ్లపైన చాట్ మసాలా, ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉందా? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-30T19:13:49+05:30 IST

పుచ్చకాయ(watermelon), జామ(guava), పైనాపిల్(pineapple) పండ్ల మీద కచ్చితంగా ఉప్పు, చిల్లీ పౌడర్ కలిపిన సాల్ట్ వేసుకుని తినడం చిన్నప్పటి నుండి చాలామంది అలవాటు...

మీకూ కోసిన పండ్లపైన చాట్ మసాలా, ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉందా?  ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే..

వేసవికాలంలో బయటకు వెళ్ళినప్పుడు చాలామంది వేసవితాపం తగ్గించే పండ్లు తినడానికి ఇష్టపడతారు. అన్ని రకాల పండ్లను ముక్కలుగా కోసి వాటి మీద కాస్త ఉప్పు, చాట్ మసాలా చల్లి ఇస్తుంటారు. చిన్నప్పటి నుండి పుచ్చకాయ, జామకాయ వంటి పండ్లను ఉప్పు, కారంలో అద్దుకుని తినడం అందరికీ అలవాటు. ఇవి తినడానికి భలే రుచిగా ఉంటాయి. అలాగే పండ్ల మీద పంచదార వేసుకుని తినడం కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది. కానీ ఇలా తినడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. పండ్లను ఇలా తీసుకుంటే ఏ ప్రమాదాలు వస్తాయి? తినే పండ్ల వల్ల ఆరోగ్యం చేకూరాలంటే ఎలా తినాలి? వివరంగా తెలుసుకంటే..

పండ్లమీద ఉప్పు, చాట్ మసాలా చల్లుకుని తింటే..(Fruits with salt, chat masala)

పుచ్చకాయ(watermelon), జామ(guava), పైనాపిల్(pineapple) పండ్ల మీద కచ్చితంగా ఉప్పు, చిల్లీ పౌడర్ కలిపిన సాల్ట్ వేసుకుని తినడం చిన్నప్పటి నుండి చాలామంది అలవాటు. వీటితో పాటు ఆపిల్, కర్భూజా, బొప్పాయి ఇలా అన్నిపండ్లను(fruits) ముక్కలుగా కోసి ఫ్రూట్ సలాడ్ లా అమ్మేవారు కూడా చాట్ మసాలా చల్లి ఇస్తుంటారు. పండ్ల మీద ఉప్పు, చాట్ మసాలా చల్లినప్పుడు ఉప్పు ప్రభావం వల్ల పండ్ల నుండి నీరు ఊరుతుంది. ఈ కారణంగా పండ్లలో ఉన్న పోషకాలు నశిస్తాయి(nutrients loss). చాట్ మసాలాలో ముందే ఉప్పు ఉంటుంది, దీనికి తోడుగా మళ్లీ ఉప్పు చల్లినప్పుడు సోడియం పాళ్లు అధికమవుతాయి. పండ్లతో సహా సోడియం శరీరంలోకి చేరితే అది కిడ్నీ మీద ప్రభావం చూపుతుంది(effects on kidneys). చాట్ మసాలా, ఉప్పు, కారం కలిపిన పండ్లు తీసుకోవడం జీర్ణాశయానికి చాలా రిస్క్ ఇచ్చినట్టవుతుంది. కాబట్టి ఉప్పు, చాట్ మసాలా, కారం పండ్ల మీద చల్లుకుని తినకూడదు.

Funny Video: చేతిమీద ముద్దు పెట్టి మరీ సారీ చెప్పినా అస్సలు కోపం తగ్గదంట.. నెట్టింట్లో వైరల్ అవుతున్న కంగారూల లవ్ స్టోరీ..


పండ్లమీద పంచదార వేసుకుని తింటే..(sugar with fruits)

ఇంట్లో పండ్లు ఏవైనా కట్ చేసినప్పుడు అవి తగినంత తియ్యగా లేకపోతే చాలామంది వాటికి పంచదార కలిపి జ్యూస్ చెయ్యడం లేదా పండ్లముక్కల మీద పంచదార చల్లుకుని తినడం చేస్తూంటారు. పండ్లలో సహజంగానే గ్లూకోజ్(glucose) ఉంటుంది. పండ్లు పైకి తియ్యగా లేకపోయినా గ్లూకోజ్ అయితే ఉంటుంది. వీటి మీద పంచదార చల్లుకుని తిన్నప్పుడు శరీరానికి పెద్ద మొత్తంలో గ్లూకోజ్ అందుతుంది. ఇవి తొందరగా మధుమేహం(diabetes) రావడానికి, అధికబరువుకు(over weight) కారణం అవుతాయి. పండ్లు తింటే ఏమీ కాదనే అపోహతో ఎక్కువ పండ్లు తిన్నా బరువు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

భోజనంలో పండ్లు..(fruits with meals)

భారతీయుల భోజనంలో పండ్లకు కూడా తప్పకుండా స్థానం ఉంటుంది. భోజనం తరువాత అరటిపండు(banana) తినడం చాలామందికి అలవాటు. మరికొంతమందికి మామిడిపళ్ళు తినడం ఇష్టం. అందుబాటులో ఉన్న ఏదో ఒక పండును తినేస్తుంటారు. మరికొందరు దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా తింటూంటారు. అయితే మన భోజనంలో అన్నం(Rice), రొట్టెలు(roties), పప్పు(dal), స్వీట్లు(sweets), హాట్(hot items) ఇలా అన్నిటిని గమనిస్తే వీటిలో కార్బోహైడ్రేట్స్(carbohydrates) ఎక్కువగా ఉంటాయి. భోజనంలో పండ్లు తింటే శరీరంలోకి వెళ్లే కార్బోహైడ్రేట్స్, కేలరీల కంటెంట్ పెరుగుతుంది(increase carbohydrates, calories content). అందుకే పండ్లను, పిండి పదార్థాలను విడిగా తినమని అన్నిరకాల వైద్య విధానాలు చెబుతున్నాయి.

Viral Video: ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. ఈ పిల్లాడు చేపలు పట్టే టెక్నిక్ చూస్తే అవాక్కవుతారు..



Updated Date - 2023-04-30T19:22:18+05:30 IST